ఫ్రెండ్ పుట్టినరోజుకని వెళ్లి... రక్త మడుగులో తేలాడు

Published : Feb 19, 2020, 08:38 AM IST
ఫ్రెండ్ పుట్టినరోజుకని వెళ్లి... రక్త మడుగులో తేలాడు

సారాంశం

ఆయుష్... సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి రూ.2500 నగదు తీసుకొని స్నేహితుడి బర్త్ డే కి వెళ్తున్నాని చెప్పి వెళ్లాడు. అతని వెంట మరో ఇద్దరు స్నేహితులు కూడా వెళ్లారు.

ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్రెండ్ పుట్టినరోజుని.. పార్టీకి వెళతానని చెప్పిన విద్యార్థి తీరా రక్తమడుగులో ప్రాణాలు కోల్పోయి  కనిపించాడు. ఈ సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ సమీపంలోని క్రిషే గార్డెన్ అపార్ట్ మెంట్స్ భవనం పై నుంచి కింద పడి ఓ బాలుడు పడినట్లు ఉదయం 5గంటల 30 నిమిషాల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి పరిశీలించగా... బాలుడు యాప్రాల్ కి చెందిన సంజయ్ కుమార్ చాన్ బే కుమారుడు ఆయుష్ చాన్ బే(17) గా గుర్తించారు.

ఆయుష్... సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి రూ.2500 నగదు తీసుకొని స్నేహితుడి బర్త్ డే కి వెళ్తున్నాని చెప్పి వెళ్లాడు. అతని వెంట మరో ఇద్దరు స్నేహితులు కూడా వెళ్లారు.

Also Read హైద్రాబాద్‌లో కారు భీభత్సం: పాన్‌షాపులోకి దూసుకెళ్లిన కారు...

ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింద. దీంతో.. కంగారు పడిన వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... బేగంపేట యూఎస్ కాన్సులేట్ కి సమీపంలో చనిపోయి కనిపించాడు.

కాగా.. బాలుడిది అనుకోకుండా భవనం పై నుంచి కిందపడి ప్రమాదవశాత్తు చనిపోయాడా.? లేక ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఇంకెవరైనా కావాలని హత్య చేశారో తెలియాల్సి ఉంది. పలు కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే