బెంగుళూరులో ఇవాళ రూ. 42 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణకు ఈ నగదును తరలిస్తున్న సమయంలో ఐటీ అధికారులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో శుక్రవారం నాడు తెల్లవారుజామున రూ. 42 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణకు ఈ నగదును తరలిస్తున్న సమయంలో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్ నుండి ఈ హవాలా మార్గంలో నగదును తరలిస్తున్నారని ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా ఐటీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రూ.8 కోట్లను తెలంగాణకు తరలించినట్టుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందిన డబ్బుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు ఈ కేసును ఐటీ నుండి ఈడీకి బదిలీ అయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కర్ణాటక నుండి తెలంగాణకు నగదును తరలిస్తున్నారనే సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాక్సుల్లో నగదును పెట్టి లారీలో తరలించే సమయంలో ఐటీ అధికారులు సీజ్ చేశారు.
undefined
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో ఈ దఫా ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ పట్టుదలగా ఉన్నాయి. మరో వైపు రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ కూడ అంతే పట్టుదలతో కార్యరంగంలో దిగింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో హైద్రాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని నగదును పోలీసులు సీజ్ చేశారు. బంగారం, వెండిని కూడ పోలీసులు సీజ్ చేశారు. గత నాలుగు రోజులుగా పోలీసుల తనిఖీల్లో రూ. 37 కోట్లు పట్టుబడ్డాయి. 30 కిలోల బంగారం, 350 కిలోల వెండిని కూడ పోలీసులు సీజ్ చేశారు.
తెలంగాణలో ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కొందరు అధికారులను విధుల నుండి తప్పించింది ఈసీ, ఈ అధికారుల స్థానంలో కొందరిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మరో వైపు మద్యం, నగదు తరలింపును అరికట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఈసీ అధికారులకు సూచించింది.