హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: చంద్రబాబు ప్రచారం చేస్తారా?

By narsimha lodeFirst Published Oct 3, 2019, 7:52 AM IST
Highlights

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తారా అనే చర్చసాగుతోంది.

హైదరాబాద్:ఈ నెల 21వ తేదీన జరిగే హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. 

గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రజాకూటమి తరపున ప్రచారం నిర్వహించడం వల్లే టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం చేస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ పోటీ చేసింది.ఈ స్థానంలో ఆ సమయంలో వంగాల స్వామిగౌడ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో స్వామిగౌడ్ కు సుమారు 25వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 

2018 ఎన్నికల్లో టీడీపీ ప్రజా కూటమిలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్,టీడీపీ, సీపీఐ, తెలంగాణ ప్రజా సమితిలు ఈ కూటమిలో ఉన్నాయి.పొత్తులో భాగంగా హుజూర్‌నగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కు టీడీపీ మద్దతు ఇచ్చింది.

ప్రజా కూటమి అభ్యర్ధుల తరపున ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు  ప్రచారం నిర్వహించారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. 

ఈ నెల 21న, హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గం గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దులో ఉంటుంది. దీంతో చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తే ప్రయోజనం ఉంటుందని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

 మరికొందరు నేతలు చంద్రబాబు ప్రచారం చేస్తే టీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ప్రయోజనం పొందే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను కూడ వ్యక్తం చేస్తున్నారు.

2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని  70కు పైగా స్థానాల్లో పోటీ చేసింది. మిగిలిన స్థానాలను బీజేపీకి ఇచ్చింది.ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ విషయాన్ని కూడ కొందరు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారా లేదా అనే విషయమై త్వరలోనే స్పష్టత రానుంది.


 

click me!