డికె అరుణ మంత్రి పదవి ఆశిస్తున్నారా?

Published : Oct 30, 2016, 11:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
డికె అరుణ మంత్రి పదవి ఆశిస్తున్నారా?

సారాంశం

కాంగ్రెస్  ఎమ్మెల్యే డికె అరుణ టిఆర్  ఎస్ లో చేరడం ఖాయమా మంత్రి పదవి కోసం బేరసారాలాడుతున్నారా తెలంగాణా రెడ్లను మెల్లిగా మచ్చి క చేసుకుంటున్న   కెసి ఆర్

గద్వాల శాసన సభ్యురాలు డికె అరుణ తెలంగాణా రాష్ట్ర సమితిలో  చేరేందుకు రంగం సిద్ధమయినట్లే. గద్వాల జిల్లాగా ఏర్పడిన తర్వాత పోరాటం చేసేందుకు అరుణకు సమస్యలేవీ  మిగల్లేదు- ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని రాజకీయంగా విమర్శించడం తప్ప.

 

జిల్లా ఏర్పాటే ఆమెకు ప్రధాన డిమాండ్ గా ఉంటూ వచ్చింది. పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె నిర్వహించిన భారీ కార్యక్రమాలన్నీ గద్వాల డిమాండ్ చుట్టే తిరిగాయి.  2014 ఎన్నికల  ప్రధాన నినాదం కూడా  గద్వాల జిల్లా ఏర్పాటే.  జిల్లాల తాత్కాలిక జాబితాలో గద్వాల లేకపోవడంతో ఆమె పోరాటం ఉ ధృతం చేశారు.  బంద్ లు, ధర్నాలు నిర్వహించారు.  మరొక కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యతో కలసి జనగాం, గద్వాల దీక్ష చేపట్టారు.  జూలైలో నేషనల్ హైవే దిగ్బంధనం చేశారు. గద్వాలను జిల్లా చేయాలని, దానికి జోగులాంబ పేరు పెట్టాలని గద్వాల పట్టణంలోని జమ్ములమ్మ గుడి నుంచి,  అలంపూర్ జోగులాంబ గుడి దాకా 60 కి.మి పాదయాత్ర చేశారు. కేవలం తను ఎమ్మెల్యే గా ఉన్నందున, జిల్లా చేస్తే తన ప్రాబల్యం ఈ ప్రాంతంలో పెరిగిపోతుందనే భయంతో నే ముఖ్యమంత్రి కెసిఆర్ గద్వాల కు జిల్లా హోదా కల్పించడంలేదని ఆమె ఆరోపిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి పేరెత్తుతూ ఆయన కయ్యానికి తలపడిన కొద్ది మంది కాంగ్రెస్ నేతలతో ఆమె ఒకరు.  13500 అభ్యంతరాలున్న వనపర్తిని జిల్లా చేయడం,  ప్రజలంతా కోరుతున్న గద్వాలను విస్మరించడం పచ్చి రాజకీయం అన్నారు.

 

2014లో తెలంగాణాలో కెసిఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడిన కొద్దిమంది కాంగ్రెస్ నేతలో డికె అరుణ ఒకరు. వాళ్ల కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. అయితే, తెలంగాణా వచ్చాక రాజకీయానుబంధాలు, రాజకీయ విధేయతలు సులభంగా మారిపోతున్నాయి.  జిల్లా హోదా  ఇవ్వక పోవడానికి కారణం తన శాసన సభ్యురాలు కావడమే అడ్డంకి అయితే, అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి, ఇదిగో రాజీనామా, స్వీకరించి గద్వాల జిల్లా ప్రకటించండని ముఖ్యమంత్రి రాజీనామా లేఖను పంపారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి కెసిఆర్ సిరిసిల్లా, జనగాం, గద్వాల జిల్లాలను ప్రకటించారు.

 

కాంగ్రెస్ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గద్వాల జిల్లా కోసం అరుణ ముఖ్యమంత్రి తో ఒక అవగాహన కుదుర్చకున్నారు.  ఆ ఒప్పందం ప్రకారం ఆమె  తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరతారు.  అందువల్ల దీపావళి తర్వాత  ఏదో ఒక రోజు పింక్ కండువా కప్పకుంటారని  కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు.

 

శనివారం నాడు  నిజాంబాద్ లోక్ సభ సభ్యురాలు కవిత వెల్లడించిన విషయాలను దీనికి రుజువుగా మహబూబ్ నగర్ చెందిన కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు.డికె అరుణ తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరేందుకు అభ్యంతరం లేదని, తాము అడ్డుకోమని  కవిత హైదరాబాద్ లో చెప్పారు.  “ ఆమె ఇప్పటికే చేరాల్సిఉండింది. ఏవో కారణాల వల్ల  అది సాధ్యపడలేదు,” అని కవిత  చెప్పారు.

 

మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయాల కారణాల వల్ల ఆమె తెరాస ప్రస్థానం వాయిదాపడుతూ ఉందని చెబుతున్నారు. తెరాస మంత్రి జూపల్లి కృష్ణరావు, డికె అరుణకు చాలా కాలంగా విబేధాలున్నాయి. ఈ విబేధాల కారణంగా , జూపల్లి కాంగ్రెస్ వదిలేసి తెలంగాణా చేరిపోయారని అందరికి తెలిసింది. తర్వాత ఆయన తెరాసలోబాగా  ఎదిగి ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యారు. ఇపుడు పరిస్థితులు తారుమారయి, ఆయన ఉండే పార్టీలోకే ఇపుడు అరుణ వెళ్లాల్సి వస్తావుంది. అరుణ చేరాక, టిఆర్ ఎస్ లో ముఠా రాజకీయాలు మొదలుకాకుండా ఉండేందుకు జూపల్లి కి నచ్చ చప్పేందుకు టిఆర్ఎస్ నాయకత్వం  ప్రయత్నిస్తూ ఉందని  చెబుతున్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో ముఠాలు తావుండదని , అందువల్ల అరుణ  చేర్చుకోవడానికి జూపల్లికి అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదన్నదని  అరుణ అనుయాముడొకరు చెప్పారు.

 

క్యాబినెట్లో మహిళా మంత్రులెవరూ లేరు కాబటి పార్టీలో చేరితే, ఆమెకు మంత్రి పదవి కూడా రావచ్చు కాంగ్రెస్ లోకి ఒక వర్గం చెబుతూ వుంది.  బలమయిన రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేస్తే,  పాత మహబూబ్ నగర్ జిల్లా ఏరియా లో టిఆర్ఎస్ కు ఎదురు ఉండదు.   2019 ఎన్నికల ముందు జిల్లాలో రెడ్డి వర్గాన్ని శాంతింప చేయడం అవసరం కూడా.

 

ఇప్పటికే,  అరుణ తమ్ముడు , మక్తల్ శాపన సభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ లోనే టిఆర్ ఎస్ లో చేరిపోయారు. అరుణ చేరితే, కాంగ్రెస్ కు చావు దెబ్బ తగిలినట్లే.2019 నాటికి  టిఆర్ఎస్ ను ఢీ కొనేందుకు ఒక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను సమాయత్ం చేస్తుంటే, మరొక వైపు  ఏ వర్గం లక్ష్యంతా ఉత్తమ్  ముందు కెళుతున్నారో,  ఆ వర్గాన్ని టిఆర్ఎస్ వైపు మళ్లించేందుకు ముఖ్యమంత్రి పథకం వేస్తున్నట్లుంది.

 

 

 

PREV
click me!

Recommended Stories

KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu