Uttam Kumar Reddy: "అది కేసీఆర్‌ ఆడిన నాటకం" 

By Rajesh Karampoori  |  First Published Feb 6, 2024, 1:21 AM IST

Uttam Kumar Reddy: తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి పోలింగ్ నాడు సీఎం జగన్‌తో మాట్లాడి సీఆర్పీఎఫ్ బలగాలను నాగార్జున సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్‌ ఆడిన నాటకమని విమర్శించారు.


Uttam Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణ నీటిలో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలకుల అసమర్థత వల్లనే కృష్ణ పరివాహక జిల్లాలో రైతులకు అన్యాయం జరిగిందని ఆగ్రహం జరిగిందనీ, ఏ ప్రతిపదికన తీసుకున్నా వీళ్ళు చేసింది తప్పేనన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చాలా అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.

నీటిపారుదల ప్రాజెక్టులపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను తిప్పికొడుతూ.. తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించిందన్న తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకొని మెయింటెనెన్స్ కింద 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా పేర్కొన్నారు 

Latest Videos

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014లో తెలంగాణకు కృష్ణా నీటిలో ఎక్కువ వాటా ఇవ్వాలని అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టుబట్టాల్సి ఉందని, నదీ పరీవాహక ప్రాంతాల్లో పరీవాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం, జనాభా, సాగు విస్తీర్ణం ఆధారంగా నదీజలాల పంపిణీని నిర్ణయించారు. అయినా తెలంగాణకు అన్ని అంశాల్లోనూ అన్యాయం జరిగిందని అన్నారు.

KRMB సమావేశం యొక్క మినిట్స్‌ను చదివి, ప్రాజెక్టులను KRMB కి అప్పగించడానికి BRS ప్రభుత్వమే అంగీకరించిందని, కేసీఆర్ సమర్పించిన 2023-24 బడ్జెట్ పత్రాలలో అదే ప్రతిబింబించిందని ఆయన ఎత్తి చూపారు. నిర్వహణ కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని విమర్శించారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు టెండర్లు వేసేందుకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చే ఏడు టీఎంసీల కృష్ణా నీటిని వినియోగించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 8 టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించిందని విమర్శించారు. దీనికి సంబంధించి మే 5, 2020న ఏపీ ప్రభుత్వం జీఓ నెం 203ని జారీ చేసిందని తెలిపారు. 

సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 95 వేల కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కానీ లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదనీ, మేడిగడ్డతో పాటు మరో రెండు బ్యారేజీలు దెబ్బతినడంతో ప్రాజెక్టు మొత్తం ఎక్కడికక్కడే నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఖర్చు పెరిగి రూ.27,500 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరం కూడా సాగు కాలేదనీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమసాగర్, కోయల్ సాగర్ వంటి అన్ని ప్రాజెక్టులను పెండింగ్‌లో ఉంచారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన పాత్రను ప్రశ్నించినందుకు బీఆర్‌ఎస్ నేత టి.హరీశ్‌రావుపై మంత్రి మండిపడ్డారు. అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం వల్లే తెలంగాణ సాకారమైందని, అందులో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో కూడా BRS నాయకులు "బ్లాక్‌మెయిలర్లు" అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉదాసీనంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్‌కు బలగాలను పంపారని, రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్‌ ఆడిన నాటకమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

click me!