బాల్క సుమన్‌పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..? 

By Rajesh Karampoori  |  First Published Feb 5, 2024, 11:33 PM IST

MLA Balka Suman: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదయింది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


MLA Balka Suman: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్‌లో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని దూషిస్తూ.. చెప్పుతో కొడతానంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  బాల్క సుమన్‌ పై స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె. ప్రంసాగర్‌రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖ, ఇతర కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్‌పై 294బీ  (అసభ్య పదజాలం), 504(ఉద్దేశపూర్వకంగా కించపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు)సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Latest Videos

undefined

కేసీఆర్‌పై  సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ.. సోమవారం నాడు ఆదిలాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని దూషిస్తూ  బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన కాలి చెప్పును తీసి చూపించారు. రేవంత్ రెడ్డి పెద్ద రండగాడు.. హౌలేగాడు అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంచిర్యాల ఎమ్మెల్యే ఆగ్రహం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై  బాల్క సుమన్ దుర్భాషలాడిన వ్యాఖ్యలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  తీవ్రంగా  ఖండించారు. సుమన్‌కు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు గుణపాఠం చెబుతారని ప్రేంసాగర్‌రావు అన్నారు. సుమన్‌ సెక్స్‌ కుంభకోణాలకు పాల్పడ్డారని తమకు తెలుసని, త్వరలోనే వాటిని పార్టీ బయటపెడుతుందని ఆయన అన్నారు.

click me!