కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు : హరీష్ రావు

First Published Jun 22, 2018, 5:51 PM IST
Highlights

డిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగుతున్నాయన్న హరీష్

ఏపి సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరిష్ రావు మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ను అడ్డుకోడానికి డిల్లీ స్థాయిలో  చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి హరీష్ రావు ఇవాళ జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలంగాణ లోని కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయని అన్నారు. వీరికి పక్క రాష్ట్ర సీఎం అండదండలు అందిస్తున్నారుని అన్నారు. ఓట్ల కోసం చంద్ర బాబు ఇలా చేస్తున్నారని, అయితే ఇలాంటి పనులను చూస్తూ ఇక్కడ ప్రజలెవరూ ఊరుకోరని హెచ్చరించారు.

ఇక జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టును రూ.16000 కోట్లతో పూర్తి చేశామని హరీష్ గుర్తుచేశారు. దీంతో రానున్న రోజుల్లో పాత కరీంనగర్ జిల్లా మొత్తం కోనసీమను మించిపోతుందని అన్నారు. ఇలా తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చుతున్నట్లు హరీష్ స్పష్టం చేశారు. 

click me!