‘ఇరానీ చాయ్’ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన ధరలు చురుక్కుమనిపిస్తున్నాయి..

Published : Mar 25, 2022, 09:14 AM IST
‘ఇరానీ చాయ్’ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన ధరలు చురుక్కుమనిపిస్తున్నాయి..

సారాంశం

ఇరానీ చాయ్ టేస్టే సపరేటు.. అందుకే ఆ రుచికి అలవాటు పడ్డ నాలుక మరో టీని ఇష్టపడదు. అయితే ఇప్పుడా టీ ధర చురుక్కుమనిపించనుంది. నేటినుంచి ఇరానీ ఛాయ్ ధర కప్పుకు రూ.5 పెరిగింది.   

హైదరాబాద్ :  హైదరాబాద్ షాన్.. పెహచాన్.. Irani Tea.. ఒక్కసారి దీని రుచి చూసినవారెవరైనా మామూలు చాయ్ తాగాలంటే అంతగా ఇష్టపడరు. అది దాని ప్రత్యేకత. రుచిలో మాత్రమే కాదు.. చేసే విధానంలోనూ ఎంతో ప్రత్యేకత ఈ ఇరానీ ఛాయ్ ది. అయితే ఇప్పుడు ఇరానీ ఛాయ్ ప్రియులకు దాని ధర చుక్కలు చూపించనుంది. ఎందుకంటే ఈ ఇరానీ చాయ్ ధర పెంపునకు hotels బృందం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి five rupees పెంచనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో హోటళ్ల మనుగడ సాగని క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం కప్పు టీ ధర రూ.15 నుంచి 20 రూపాయలకు పెంచారు. కరోనా ప్రభావం ఈ హోటల్లో పైనా పడింది. ఇరానీ చాయ్ పత్తి ధర కిలో రూ. మూడు వందల నుంచి రూ. 500కు చేరుకుంది. నాణ్యమైన పాలతో మాత్రమే సంప్రదాయ ఇరానీ ఛాయ్ చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం నాణ్యమైన పాలు లీటరు రూ. 100కు చేరగా... వాణిజ్య సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది.  కరోనా తరువాత నిర్వహణ ఖర్చులు పెరిగి పోవడంతో.. పాత ధరలకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇరానీ చాయ్ తయారు చేయడమూ ఓ ప్రత్యేక కళే.  నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడిన ప్రత్యేక రుచి రాదు. దీంతో ధరలు పెంచక తప్పడం లేదంటున్నారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 22న చాయ్ కు సంబంధించిన ఓ విచిత్ర విషయం వెలుగులోకి వచ్చింది. బీహార్ లో ఎవ్వరూ కలలోనైనా ఊహించని విచిత్రమైన ఘటన జరిగింది. బీహార్ రాష్ట్రం ముజఫర్ పుర్ జిల్లాలో ఓ గమ్మత్తైన కేసు వెలుగుచూసింది. విషయం విన్న అందరూ అదేలా జరిగిందంటూ ఆశ్చర్యపోతున్నారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అతని కడుపులో గ్లాసు ఉందని గుర్తించారు. అది కూడా గాజు గ్లాసు కావడంతో షాక్ తిన్నారు. అసలు ఆ గ్లాసు ఆయన కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియక తికమక పడ్డారు.

ముందుగానైతే శస్త్రచికిత్స చేసి ఆ గ్లాసును కడుపులోనుంచి తొలగించారు. జిల్లాలోని మడిపూర్ ప్రాంతానికి చెందిన 55 యేళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వెంటనే వైద్యులు అతనికి ఎక్స్-రే తీయగా.. బాధితుడి కడుపులో గ్లాసు ఉన్న సంగతి తెలిసింది. 

దానికి తీయడానికి మొదట ఎండోస్కోపీ ద్వారా విఫలయత్నం చేశారు. చివరకు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ విషయం మీద బాధితుడిని ఆరా తీయగా.. అతను మాట్లాడుతూ ఛాయ్ తాగేప్పుడు పొరపాటున గ్లాసు మింగేశానని తాపీగా సమాధానం చెప్పాడు. ఇంతకీ అలా మింగడం.. అది గొంతులో పట్టడం సాధ్యమేనా..? అసలు అలా ఎలా జరిగింది. చిన్న చింతపిక్క ఇరుక్కుంటేనే ఊపిరి ఆడకుండా పోతుందే.. అలాంటిది.. గ్లాసు ఎంత చిన్నదైనా సరే ఎలా గొంతులోకి జారింది.. అనేది ఇప్పుడు హండ్రెడ్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

President of India Droupadi Murmu Departs from Hakimpet Airport | Hyderabad | Asianet News Telugu
Hyderabad Cold Wave Alert | వాతావరణ పరిస్థితులపై IMD ధర్మరాజు కీలక సమాచారం | Asianet News Telugu