ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం..

By SumaBala Bukka  |  First Published Oct 24, 2023, 12:46 PM IST

ఎమ్మెల్సీ కవితకు ఓ అరుదైన అవకాశం లభించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఓ అంశం మీద ప్రసంగించడానికి ఆహ్వానం అందింది. 


హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఈ నెల 30న ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ‘డెవలప్ మెంట్ ఎకనామిక్స్’ అనే అంశం మీద కవిత ప్రసంగించనున్నారు. ఇందులో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.  

click me!