పరీక్షరాసి వెళుతుండగా ఆటో బోల్తా... వేములవాడలో ఇంటర్ విద్యార్థినులకు గాయాలు (వీడియో)

Published : Mar 24, 2023, 02:03 PM ISTUpdated : Mar 24, 2023, 02:39 PM IST
పరీక్షరాసి వెళుతుండగా ఆటో బోల్తా... వేములవాడలో ఇంటర్ విద్యార్థినులకు గాయాలు (వీడియో)

సారాంశం

ఇంటర్మీడియట్ పరీక్ష రాసి వెళుతున్న కస్తూర్బా జూనియర్ కాలేజీ విద్యార్థినులు రోడ్డు ప్రమాదానికి గురైన దుర్ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

సిరిసిల్ల : పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థినులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఇంటర్మీయట్ పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ కస్తూర్భా జూనియర్ కాలేజీ విద్యార్థినులు ప్రతిరోజు పరీక్షా కేంద్రానికి ఆటోలో వెళ్ళివస్తున్నారు. ఇలా ఇవాళ కూడా పరీక్ష రాసి ఆటోలో వెళుతుండగా విద్యార్థినులు ప్రమాదానికి గురయ్యారు. 

వీడియో

వేములవాడ మండలం మర్రిపల్లి వద్ద విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అమ్మాయిలు గాయపడ్డారు. వెంటనే వారిని వేములవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే