అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

By narsimha lodeFirst Published Apr 22, 2019, 5:53 PM IST
Highlights

తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకొంటామని  ఇంటర్  బోర్డు కార్యదర్శి ఆశోక్ ప్రకటించారు.గ్లోబరిన్ సంస్థ అతి తక్కువ రేటు వేసినందునే  ఆ సంస్థకు కాంట్రాక్టు కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు.
 

హైదరాబాద్: తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకొంటామని  ఇంటర్  బోర్డు కార్యదర్శి ఆశోక్ ప్రకటించారు.గ్లోబరిన్ సంస్థ అతి తక్కువ రేటు వేసినందునే  ఆ సంస్థకు కాంట్రాక్టు కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు సాయంత్రం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్ మీడియాతో మాట్లాడారు.ఇంటర్ మార్కుల వివాదంపై ఆయన వివరణ ఇచ్చారు.ఇంటర్ పరీక్షల్లో నవ్య అనే విద్యార్థిని కి 99 మార్కులు వస్తే పొరపాటున ఎగ్జామినర్ సున్న మార్కులు ఇచ్చారని చెప్పారు. ఓఎంఆర్ బబ్లింగ్‌లో పొరపాటువల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు.

తప్పు చేసిన అధికారుల నుండి  వివరణ కోరామన్నారు.అంతేకాదు వారిపై చర్యలు తీసుకొంటామన్నారు. ఏ విద్యార్థి జవాబు పత్రాలు కూడ మిస్ కాలేదన్నారు. జవాబు పత్రాలకు కూడ ఈవీఎంల మాదిరిగానే పోలీసు భద్రత ఉంటుందని  ఆయన తెలిపారు.

సెంటర్  మారిన కారణంగా మార్కుల జాబితాలో ఎఎఫ్, ఎబి అనే అని ముద్రించబడిందన్నారు. టెక్నికల్ అవగాహాన లోపం కారణంగా మీడియాలో వార్తలు వచ్చినట్టుగా ఆయన వివరణ ఇచ్చారు.

పరీక్షలు రాయనివారు పాసైనట్టుగా నమోదు కాలేదన్నారు పరీక్షలకు హాజరుకాని వారు పాస్ కావడం అనేది జరగనే జరగదన్నారు.ఈ విషయమై తాను ఛాలెంజ్  చేస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.

గ్లోబరిన్, మాగ్నటిక్  సంస్థలు టెండర్లు వేసినట్టు చెప్పారు. అన్ని రకాలుగా  ఈ సంస్థలను పరిశీలించిన మీదట గ్లోబరిన్ అనే సంస్థకు టెండర్‌ను కేటాయించినట్టుగా ఆయన వివరణ ఇచ్చారు. టెండర్‌లో గ్లోబరిన్ అనే సంస్థ తక్కువ రేట్‌ను కేటాయించిందన్నారు. 

మాగ్నటిక్ అనే సంస్థ గ్లోబరిన్  సంస్థ కంటే ఎక్కువ  రేటును వేయడంతో గ్లోబరిన్ సంస్థకే టెండర్ కేటాయించిందని ఆయన  వివరించారు.ప్రభుత్వ  ఐటీ శాఖకు చెందిన నిపుణులు కూడ గ్లోబరిన్ సంస్థను సర్టిఫై చేశారని ఆయన గుర్తు చేశారు. అర్హులైన లెక్చరర్లతోనే జవాబు పత్రాలను వాల్యూయేషన్ చేయిస్తున్నామని  ఆశోక్  చెప్పారు.

అధ్యాపకులదే పొరపాటని తేలితే వారిపై చర్యలు తీసుకొంటామని ఆయన తేల్చి చెప్పారు. రీ కౌంటింగ్,రీ వెరిఫికేషన్ కోసం ధరఖాస్తు చేససుకోవచ్చని ఆయన కోరారు.రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం  అవసరమైతే తేదీని పొడిగించే అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించనున్నట్టు ఆయన చెప్పారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించనున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థుల జవాబు పత్రాలను  ఇచ్చేందుకు కూడ తాము సిద్దంగా ఉన్నామని  ఆయన స్పష్టం చేశారు.

click me!