అఫిడవిట్ ఇస్తేనే బీ- ఫారం: టీపీసీసీ నిర్ణయం

By narsimha lodeFirst Published Apr 22, 2019, 3:53 PM IST
Highlights

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే  ఎంపిక చేసి వారికి బీ - ఫారాలను  అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను డీసీసీలకు అప్పగించింది.
 


హైదరాబాద్: స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే  ఎంపిక చేసి వారికి బీ - ఫారాలను  అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను డీసీసీలకు అప్పగించింది.

రాష్ట్రంలోని 32 డీసీసీ అధ్యక్షులతో టీపీసీపీ చీఫ్  ఉత్తమ్ కుమార్  రెడ్డి ఆదివారం సాయంత్రం గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు ఉత్తమ్ ఏ- ఫారాలను అందించారు.  

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీ-ఫారం తీసుకొనే సమయంలో  రూ. 20 స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ను తీసుకోవాలని  డీసీసీ అధ్యక్షులకు ఉత్తమ్ సూచించారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమని, పార్టీ విప్‌, ఆదేశాలను  ధిక్కరించబోమని పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్ సమర్సిస్తేనే బీ-ఫారాన్ని  అభ్యర్థులకు అందించనున్నారు.

గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించాలని  ఉత్తమ్  డీసీసీ అధ్యక్షులకు సూచించారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలతో పాటు గెలుపు అవకాశాలను కూడ పరిగణనలోకి తీసుకోవాలని  ఉత్తమ్  సూచించారు. అభ్యర్థుల ఎంపికలో వివాదాలను స్థానికంగా పరిష్కరించుకోవాలని  ఆయన సూచించారు. 
 

click me!