టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు అంశంపై గవర్నర్ కు, కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ విషయమై న్యాయ సలహా తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు అంశంపై విపక్షాల ఫిర్యాదులపై న్యాయ సలహా తీసుకుంటామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుధవారం నాడు రాజ్ భవన్ లో సమావేశమైంది. సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నేతలు, గవర్నర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసు గురించి కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు వివరించారు ఈ పేపర్ లీక్ కారణంగా
సిరిసిల్లలలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.ఈ ఘటన తనను ఆవేదనకు గురి చేసిందని ఆమె చెప్పారు. .
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అన్ని అంశాలను పరిశీలిస్తున్నానని ఆమె చెప్పారు.విద్యార్ధులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని గవర్నర్ చెప్పారు. పేపర్ లీక్ పై విపక్షాల ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటామని గవర్నర్ కాంగ్రెస్ నేతలకు తెలిపారు. రాజ్యాంగ బాధ్యతలకు లోబడే తాను పనిచేస్తానని గవర్నర్ ప్రకటించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు అంశాన్ని తీసుకుని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.