ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టులో న్యాయవాదుల మధ్య ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ సమయంలో బుధవారంనాడు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదుల మధ్య ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు పలు పిటిషన్లపై విచారణ నిర్వహించారు. ఈ కేసు విచారణ అంతా రాజకీయ దురుద్దేశ్యంతో సాగుతుందని బీజేపీ తరపు న్యాయవాది జెఠ్మలానీ వాదించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు దేశంలొని పలు రాష్ట్రాల కోర్టులకు పంపడాన్ని ఆయన ప్రస్తావించారు. సీఎం కనుసన్నల్లోనే సిట్ విచారణ సాగుతుందని జెఠ్మలానీ వాదించారు. సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో విచారణ నిర్వహించడం లేదని జెఠ్మలానీ చెప్పారు.
ఇదే కేసులో శ్రీనివాస్ తరపున మొహల్లా వాదించారు. కౌంటర్ దాఖలు చేయకుండా మొహల్లా వాదనలను ప్రారంభించడంపై ప్రభుత్వం తరపున వాదించడానికి వచ్చిన దుశ్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను వాదనలు ప్రారంభించగానే ధవే భయపడుతున్నారని దుశ్యంత్ ధువేపై మొహల్లా చెప్పారు. ఈ వ్యాఖ్యలకు దువే కూడా సెటైరికల్ గా వ్యాఖ్యానించారు. అవును మీ వాదనలకు భయపడుతున్నా.. వణికిపోతున్నానని ఆయన బిగ్గరగా చెప్పారు.
also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: తుషార్ ను అరెస్ట్ చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో జెఠ్మలానీ, మొహల్లాలు కూడా తమ వాదనలను విన్పించే సమయంలో బిగ్గరగా వాదనలు విన్పించారు. దీంతో ఒకానొక సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తక్కువ స్వరంతో వాదనలను విన్పించాలని న్యాయమూర్తి సూచించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. లంచ్ బ్రేక్ తర్వాత విచారణను కొనసాగించనుంది కోర్టు.