ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా: త్వరలోనే కొత్త షెడ్యూల్

Published : May 02, 2019, 06:05 PM IST
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా: త్వరలోనే కొత్త షెడ్యూల్

సారాంశం

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను పున: సమీక్షించనున్నట్టు ఇంటర్  బోర్డు  ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్ గురువారం నాడు ప్రకటించారు.

హైదరాబాద్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను పున: సమీక్షించనున్నట్టు ఇంటర్  బోర్డు  ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్ గురువారం నాడు ప్రకటించారు.

ఈ నెల 26, 27 తేదీల్లో BIT SAT/ JEE పరీక్షలు ఉన్నందున... ఈ మేరకు ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని  కోరారు. ఈ మేరకు ఇంటర్ సప్లిమెంటరీ  పరీక్షల తేదీలను పున: సమీక్షించి తర్వలో సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని  ఆయన ప్రకటించారు.

మరో వైపు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు కోసం గడువును ఈ నెల 4వ తేదీ వరకు పొడిగించినట్టుగా ఆయన తెలిపారు. సప్లిమెంటరీ ఫీజు చెల్లింపును ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఆయన కోరారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్