పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు: ఏపీ పోలీసు పనే

By narsimha lodeFirst Published May 2, 2019, 5:17 PM IST
Highlights

హైద్రాబాద్ పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో  ప్రయాణీకులతో గొడవపడి కాల్పులు జరిపింది ఓ పోలీస్‌గా గుర్తించారు. ఏపీ రాష్ట్ర ఇంటలిజెన్స్ వింగ్‌‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.


హైదరాబాద్:హైద్రాబాద్ పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో  ప్రయాణీకులతో గొడవపడి కాల్పులు జరిపింది ఓ పోలీస్‌గా గుర్తించారు. ఏపీ రాష్ట్ర ఇంటలిజెన్స్ వింగ్‌‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

గురువారం ఉదయం పంజగుట్ట ఆర్టీసీ బస్సులో  కాల్పులు జరిపిన విషయం కలకలం రేపింది. ఇవాళ ఉదయం విధులు ముగించుకొని శ్రీనివాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

బస్సు దిగాల్సిన సమయంలో శ్రీనివాస్ కు  అడ్డుగా ఇద్దరు ప్రయాణీకులు ఉన్నారు. దీంతో  ఆ ప్రయాణీకులతో  శ్రీనివాస్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ఆయన కోపాన్ని ఆపుకోలేని శ్రీనివాస్ వెంటనే తన వద్ద ఉన్నసర్వీస్ రివాల్వర్‌తో  బస్సులో కాల్పులకు దిగాడు. 

దీంతో ఆర్టీసీ బస్సు  పై కప్పు గుండా బుల్లెట్ దూసుకెళ్లింది.ఈ విషయమై బస్సు కండక్టర్ నుండి పోలీసులు ఫిర్యాదు తీసుకొన్నారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఈ విషయమై ఏపీ డీజీపికి కూడ తెలంగాణ పోలీసులు సమాచారమిచ్చారు. ప్రజల మధ్య కాల్పులు జరపడాన్ని ఏపీ డీజీపీ ఠాకూర్ తప్పుబట్టారు.జనాల మధ్య కాల్పులు జరపడం పెద్ద నేరమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

పంజగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పులు
 

click me!