ఫ్రెషర్స్ డేలో డ్యాన్స్ చేస్తూ..ఇంటర్ విద్యార్థిని గుండెపోటుతో మృతి..

By SumaBala BukkaFirst Published Aug 12, 2023, 12:13 PM IST
Highlights

కరీంనగర్ లో ఓ ఇంటర్ విద్యార్థిని హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. ఫ్రెషర్స్ డేలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించింది. 

కరీంనగర్ : అనుకోకుండా హార్ట్ ఎటాక్ తో మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే గుండెనొప్పికి గురై మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా కరీంనగర్ జిల్లాలో  వెలుగు చూసింది. కరీంనగర్ లోని గంగాధర లో ఇంటర్ విద్యార్థిని ప్రదీప్తి గుండెపోటుతో మృతి చెందింది.  

కాలేజీలో ఫ్రెషర్స్ డే ప్రోగ్రాంలో డాన్స్ చేస్తున్న సమయంలో ఒకసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన తోటివారు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ప్రదీప్తి మృతి చెందింది. ఆమె పడిపోవడం చూసిన స్నేహితులు కళాశాల లెక్చరర్లు సిపిఆర్ చేసి రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. 

పశువులు కూరగాయల మొక్కలు మేశాయని.. దళితుడిని స్తంభానికి కట్టి చిత్రహింసలు..

ప్రదీప్తి  కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నేలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకుంటోంది. వెంకటాయపల్లి వీరి స్వస్థలం. తల్లిదండ్రులు శారద, అంజయ్యలు. ఆమె ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. కాలేజీలో శుక్రవారం నాడు ఫ్రెషర్స్ డే పార్టీ ఉండడంతో.. మిగతా విద్యార్థులు అందరితో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేస్తుంది ప్రదీప్తి.

ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాలేజీలోని వైద్య సిబ్బంది వెంటనే సిపిఆర్ చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.  ఆమెను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.  అయితే,  ప్రదీప్తికి చిన్న వయసు నుంచి గుండెలో రంద్రం ఉంది. శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు చికిత్స చేయించలేకపోయారు. 

click me!