మహాబూబ్‌నగర్‌లో ర్యాగింగ్ భూతం: ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

Published : Dec 15, 2019, 10:50 AM ISTUpdated : Dec 15, 2019, 10:58 AM IST
మహాబూబ్‌నగర్‌లో ర్యాగింగ్ భూతం: ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

సారాంశం

ర్యాగింగ్ భూతంతో  ఇంటర్ విద్యార్ధి సంతోష్‌నాయక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహాబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకొంది.

మహాబూబ్‌నగర్: మహాబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 మహాబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని  ప్రతిభ జూనియర్ కాలేజీలో  ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సంతోష్ నాయక్ పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్టుగా  బాధితుడు ఆరోపిస్తున్నాడు.

దీంతో తన స్వగ్రామానికి వెళ్లిన సంతోష్ నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు  సంతోష్ నాయక్‌ను  జడ్చర్లలోని ఆసుప్రతిలో చేర్పారు. సంతోష్ నాయక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

సీనియర్ల ర్యాగింగ్ చేసుకోవడం వల్లే సంతోష్ ఆత్మహాత్యానికి పాల్పడినట్టుగా బాధితుడి కుటుంబసభ్యులు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్