గోల్కొండ కోట భూగర్భంలో అద్భుతం: కోట కింద...

By Nagaraju penumalaFirst Published Dec 14, 2019, 9:18 PM IST
Highlights

ఇక్కడ గోల్ఫ్ కోర్స్ పక్కనే నయాఖిలలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమిలో గత పది రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. అనేక పురాతన వస్తువులు, రాతి శిలలు బయటపడుతూనే ఉన్నాయి. 
 
హైదరాబాద్: వందేళ్ల చరిత్ర కలిగిన గోల్కొండ కోట భూగర్భంలో అద్భుతం చోటు చేసుకుంది. గోల్కొండ కోట భూగర్భంలో మరో కోట ఉందన్న ప్రచారం జరుగుతుంది. గోల్కొండ కోటలో తవ్వకాల్లో కోట కింద కోట ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక్కడ గోల్ఫ్ కోర్స్ పక్కనే నయాఖిలలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమిలో గత పది రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. అనేక పురాతన వస్తువులు, రాతి శిలలు బయటపడుతూనే ఉన్నాయి. 

తవ్వకాలలో వరుసపెట్టి 15వ శతాబ్దం నాటి శిథిలాలు బయట పడుతుండటంతో భూగర్భంలో ఏదో ఒక కట్టడం ఉండవచ్చు అని ఏఎస్ఐ అధికారులు, చరిత్రకారులు భావిస్తున్నారు. దాంతో గోల్కొండ కోట ప్రాంతంలోని ఈ ప్రాంతాలను ఏఎస్ఐ దక్షిణాది రీజినల్ డైరెక్టర్ మహేశ్వరి శనివారం పరిశీలించారు. తవ్వకాలు నిపుణుల ఆధ్వర్యంలో మరింత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 

click me!