ఇంటర్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు: సెక్రటరీ జలీల్ హెచ్చరిక

By narsimha lodeFirst Published Mar 24, 2021, 4:23 PM IST
Highlights

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ హెచ్చరించారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ హెచ్చరించారు.

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఇవాళ్టి నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న ప్రకటించింది.

ప్రత్యక్షతరగతులు లేని సమయంలో ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలని ఆయన కోరారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా నడుపుతున్నారనే ఫిర్యాదులు రావడంతో ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ బుధవారం నాడు ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలు 
ప్రారంభమయ్యాయి. అయితే విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఇవాళ్టి నుండి విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది మే లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లో ఇప్పటివరకు క్లాసులు సాగుతున్నాయి. టెన్త్, ఇంటర్ లలో ఇప్పటికే కొంత సిలబస్ ను తగ్గించారు. 
 

click me!