బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పనిచేస్తున్న తన అక్క సంగీతలాగా తానూ భారత సైన్యంలో చేరి దేశసేవ చేయాలని కలలుకన్నాడని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన అగ్నిపథ్ నిరసనల్లో మరణించిన రాకేష్ తండ్రి చెప్పుకొచ్చారు.
వరంగల్ : మేము తనను Army Officerగా చూడాలనుకున్నాం. కానీ మన రాష్ట్ర పోలీసుల తూటాలకు బలవుతాడని అనుకోలేదు అంటూ పోలీసుల కాల్పుల్లో మరణించిన Damodar Rakesh తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం Secunderabad Railway Station లో
Agneepath Scheme కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో వరంగల్ కు చెందిన దామోదర రాకేష్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేస్తున్న తన అక్క సంగీత లాగా భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని రాకేష్ కలలు కనేవాడు అని తండ్రి కుమారస్వామి చెప్పారు.
శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా వందలాది నిరసనకారులు దూసుకువచ్చారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం అందించుకుంటూ సికింద్రాబాద్ స్టేషన్‌లో దాదాపు 500 మంది నిరసనకారులు గుమిగూడారు. మూడు ప్యాసింజర్ రైళ్లపై దాడి చేశారు. బోగీలను తగులబెట్టారు. రైల్వే ట్రాక్‌ల మీద పార్శిళ్లు, టూవీలర్లు వేసి తగులబెట్టారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిల్లో నిరసనకారులు పొడవాటి కర్రలు పట్టుకుని సైన్‌బోర్డ్‌లు, ఫ్యాన్‌లు, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు, ఆగి ఉన్న రైళ్లు, దుకాణాలు, సంస్థలను ధ్వంసం చేయడం కనిపించింది.
undefined
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి.. వీరిని చెదరగొట్టడానికి, పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 12 మంది గాయపడ్డారు. ఒక బుల్లెట్ రాకేష్ ఛాతీకి తగలడంతో అతడిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్లు ప్రకటించారు.
సైన్యంలో చేరాలని తపించేవాడు.. చివరికి ఇలా : పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేశ్ తల్లిదండ్రులు
"సాధారణ రైల్వే పోలీసు (GRP) బలగాలు నిరసనకారులను కంట్రోల్ చేయడానికి కాల్పులు జరపవలసి వచ్చింది. అయితే అది కూడా లాఠీ-ఛార్జ్, టియర్ గ్యాస్ షెల్స్ లాబింగ్ లతో నిరసనలను అదుపులోకి తీసుకురావడంలో విఫలమైన తర్వాత మాత్రమే కాల్పులు జరిపారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ బ్లాక్ దబీర్ పేట గ్రామానికి చెందిన రాకేష్ మూడేళ్ల క్రితం నిర్వహించిన ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షతోపాటు ఆర్మీ రిక్రూట్ మెంట్ కు అవసరమైన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అతను 2020లో రాత పరీక్షకు హాజరు కావడానికి ఎదురుచూస్తున్నాడు. కానీ కోవిడ్-19 కారణంగా ఈ పరీక్ష వాయిదా పడింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేస్తున్న తన అక్క సంగీత లాగా భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడు అని రాకేష్ తండ్రి కుమారస్వామి చెప్పారు. అంతేకాదు ‘మూడేళ్లుగా ఎదురుచూస్తున్న రాత పరీక్ష రద్దు చేయబడిందని, అగ్నిపథ్ పథకం ద్వారా తాత్కాలికంగా యువకులను రిక్రూట్ చేసుకోవాలని అధికారులు యోచిస్తున్నారని తెలియగానే అతను రెచ్చిపోయాడు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని త్రిముల్‌ఘేరిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్‌లో పని ఉందని చెప్పి... హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పాడు’ అని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.