
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో అమానుషం జరిగింది. మేకను ఎత్తుకెళ్లారనే ఆరోపణలో ఇద్దరి యువకులను యజమానులు చిత్రహింసలకు గురి చేశారు. వారిని తలకిందులుగా వేలాడదీసి, కింద మంటబెట్టి, ఆ పొగతో ఊపిరాడకుండా చేశాడు. దీనికి సంబంధించిన వీడియాలో స్థానికంగా ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యూలేట్ అయ్యింది.
మద్యం మత్తులో భార్యతో గొడవ.. కాలుతో ఉయ్యాలను తన్నడంతో కిందపడి నెలన్నర శిశువు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రిలోని అంగడిబజార్ ప్రాంతంలో కొమురాజుల రాములు-స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు శ్రీనివాస్ ఉన్నాడు. అయితే వీరు మందమర్రి సిటీ శివారులో ఉన్న గంగనీళ్ల పంపుల దగ్గరలో ఓ షెడ్డు వేసి, అందులో మేకల పెంపకం చేపడుతున్నారు. వీరి ఇంట్లోనే 19 ఏళ్ల తేజ అనే యువకుడు ఉంటున్నాడు. వారి మేకలను కాపలా కాస్తుంటాడు. ఆ యువకుడి తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది.
'వన్ నేషన్, వన్ ఎలక్షన్' పై వైఎస్ఆర్సీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. 20 రోజుల కిందట నుంచి రాములు కుటుంబం పెంపంకం చేపడుతున్న మేకల మంద నుంచి ఒక మేక, దానితో పాటు ఒక ఐరన్ రాడ్ కనిపించడం లేదు. దీంతో ఆ కుటుంబానికి తేజపై అలాగే ఆ యువకుడి దళిత స్నేహితుడైన 30 ఏళ్ల చిలుముల కిరణ్ పై అనుమానం వచ్చింది. దీంతో ఆ యువకులిద్దరినీ రాములు కుటుంబం తమ మేకల షెడ్డు వద్దకు రమన్నారు. అక్కడి వచ్చిన తరువాత ఆ ఇద్దరి యువకులపై దాడి చేశారు. అనంతరం వారి కాళ్లకు తాడు కట్టారు. పైన కట్టేసి, వారిని తలకిందులుగా వేలాడదీసి కింద పొగ పెట్టారు. వారికి ఊపిరి ఆడకుండా చేసి చిత్ర హింసలకు గురి చేశారు. తరువాత విడిచిపెట్టారు.
షాకింగ్ ఘటన: మహిళలను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు..
అయితే దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో కిరణ్ బంధువులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాములు, శ్రీనివాస్ పై అలాగే వారి ఇంట్లో పని చేస్తున్న నరేశ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి విచారణ మొదలుపెట్టారు.