మద్యం మత్తులో భార్యతో గొడవ.. కాలుతో ఉయ్యాలను తన్నడంతో కిందపడి నెలన్నర శిశువు మృతి

Published : Sep 03, 2023, 06:59 AM IST
మద్యం మత్తులో భార్యతో గొడవ.. కాలుతో ఉయ్యాలను తన్నడంతో కిందపడి నెలన్నర శిశువు మృతి

సారాంశం

ఆ భర్త మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. భార్య చేతిలో ఉన్న కుమారుడిని లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య పెనుగులాటలో బాలుడు ఒత్తిడికి గురై చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో ఓ నెలన్నర శిశువు మరణించాడు. మద్యం మత్తులో అత్తగారించి వచ్చి, భార్యతో గొడవ పడి, క్షణికావేశంలో ఉయ్యాలను తన్నడంతో అందులో ఉన్న శిశువు కింద పడ్డాడు. దీంతో ఆ బాబుకు గాయాలు కావడంతో చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Aditya-L1: భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాలు ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచాయి.. సీఎం కేసీఆర్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామంలో జనుముల రమేష్ నివసిస్తున్నాడు. ఆయనకు నాలుగు సంవత్సరాల కిందట మండల కేంద్రానికి చెందిన చిమ్మ పున్నయ్య, శ్యామల దంపతుల పెద్ద కూతురు అయిన నిర్మలతో వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. కాగా.. 45 రోజుల కిందట మరో కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు జశ్వంత్. అయితే రెండో ప్రసవం అయిన తరువాత నెలన్నర శిశువుతో కలిసి నిర్మల తన తల్లిగారి ఇంట్లోనే ఉంటోంది.

'వన్ నేషన్, వన్ ఎలక్షన్' పై వైఎస్ఆర్సీపీ అగ్రనేత విజ‌యసాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

ఈ క్రమంలో రమేష్ తన అత్తగారింటికి శుక్రవారం వచ్చాడు. అక్కడ వారితో గొడవ పడ్డాడు. దీంతో కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. మద్యం తాగిన అనంతరం అర్థరాత్రి దాటిని తరువాత ఇంటికి వచ్చాడు. అక్కడ నిర్మలతో గొడవ పడ్డాడు. ఇలా గొడవ పడుతున్న సమయంలో కోపంతో కుమారుడు పడుకున్న ఉయ్యాలను రమేష్ కాలుతో తన్నాడు. దీంతో నిద్రలో ఉన్న జశ్వంత్ కింద పడిపోయాడు.

జ‌మిలి ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీ సిద్ధంగానే ఉంది: పేర్ని నాని

బాలుడి కింద పడ్డాడని కూడా చూడకుండా జశ్వంత్ ను తనతో ఇంటికి తీసుకొని వెళ్తానని రమేష్ పట్టుబట్టాడు. నిర్మల నుంచి తన కుమారుడిని లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రుల మధ్య కుమారుడు నలిగిపోయాడు. బాగా ఒత్తిడికి గురై, పరిస్థితి విషమించడంతో మరణించాడు. దీంతో నిర్మల, ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ