అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీలో భ‌గ్గుమంటున్న‌ అంతర్గత విభేదాలు !

By Mahesh Rajamoni  |  First Published Jun 1, 2023, 5:31 PM IST

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర  బీజేపీలో అంతర్గత విభేదాలు భ‌గ్గుమంటున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌తిపక్ష పార్టీల నుంచి నేతలను చేర్చుకునే ప్రక్రియను విరమించుకున్నట్లు ప్రకటించిన ఈటల రాజేంద‌ర్ మంగళవారం మీడియాతో చేసిన ప్రకటనపై విజయశాంతి ప్రశ్నించారు. దీంతో మ‌రోసారి బీజేపీ ర‌చ్చ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
 


Telangana BJP’s internal conflict: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర  బీజేపీలో అంతర్గత విభేదాలు భ‌గ్గుమంటున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌తిపక్ష పార్టీల నుంచి నేతలను చేర్చుకునే ప్రక్రియను విరమించుకున్నట్లు ప్రకటించిన ఈటల రాజేంద‌ర్ మంగళవారం మీడియాతో చేసిన ప్రకటనపై విజయశాంతి ప్రశ్నించారు. దీంతో మ‌రోసారి బీజేపీ ర‌చ్చ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

తెలంగాణ అసెంబ్లీకి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్ని ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే, దూకుడుగా క‌నిపిస్తున్న బీజేపీలో అంత‌ర్గ‌త విభేధాలు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య విభేధాలు ఉన్నాయ‌ని ఇటీవ‌ల రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది. అయితే, అలాంటిదేమీ లేద‌ని ఇరువురు నేత‌లు మీడియాతో మాట్లాడుతూ ఈ చ‌ర్చ‌కు ముగింపు ప‌లికారు. అయితే, ప్ర‌స్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, ఈటల రాజేందర్ మధ్య తలెత్తిన తాజా మాటల ఘర్షణ బీజేపీలో అంత‌ర్గ‌త విభేధాల‌ను బ‌హిర్గతం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలను ఎదుర్కొంటోంది.

Latest Videos

బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విజయశాంతి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నుంచి నేతలను చేర్చుకునే ప్రక్రియను విరమించుకున్నట్లు ఈటల మంగళవారం మీడియాకు ఇచ్చిన ప్రకటనను విజయశాంతి ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ కృషి ఫలితమేనా అని ప్రశ్నించిన ఆమె, పార్టీ కార్యకర్తలు, విధేయుల త్యాగాల వల్లే బీజేపీ విజయం సాధించిందని, చేరిక కమిటీ ముసుగులో ఈటల బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తో అన్ని పార్టీలకు రహస్య సంబంధాలు ఉన్నాయని ఈటల వ్యాఖ్యానించడం, బీజేపీలో అలాంటి కోవర్టు వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయాలని విజయశాంతి డిమాండ్ చేయడంతో ఇరువురు నేతల మధ్య వివాదం మరింత ముదిరింది. తనకు, బండి సంజయ్ కు మధ్య విభేదాలు లేవని, పార్టీలో ఎలాంటి ఉన్నత పదవి కావాలని తాను అడగలేదని ఈటల ఇటీవల స్పష్టం చేశారు. అయితే, గ‌త కొన్ని వారాలుగా బీజేపీలో ఈట‌ల కేంద్రంగా ఇలాంటి అంశాలు జ‌రుగుతుండ‌టంపై బీజేపీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. పార్టీలో ఏం జ‌రుగుతున్న‌ద‌నే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

click me!