నిజామా బాద్ రైతు... లాటరీలో రూ.28కోట్లు గెలుచుకున్నాడు

By telugu teamFirst Published Aug 5, 2019, 11:20 AM IST
Highlights

 వికాస్‌ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి అక్కడ రెండేళ్లపాటు డ్రైవరుగా పనిచేశారు. కొన్ని నెలల క్రితం మరోసారి వెళ్లిన వికాస్‌ పని దొరకకపోవడంతో నెలన్నర క్రితం తిరిగి వచ్చేశారు. అయితే, మొదటిసారి దుబాయ్‌ వెళ్లినప్పుడు లాటరీ టికెట్లు కొనడం అలవాటు చేసుకున్నాడు. ఎన్నిసార్లు లాటరీ టికెట్ కొన్నా... అతనికి లాటరీ తగలకపోవడం గమనార్హం.

ఒక్క లాటరీతో ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు. నిన్న, మొన్నటిదాకా కుటుంబాన్ని పోషించడమే కష్టంగా భావించిన ఆ రైతు... ఇప్పుడు కోటీశ్వరుడిగా మారాడు. అయినప్పటికీ వ్యవసాయం చేయడం మాత్రం ఆపనని చెబుతున్నాడు. మరి ఈ రైతు కథేంటంటే... 

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కల వికాస్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయం లాభాలు తెచ్చిపెట్టకపోవడంతో.. కుటుంబాన్ని పోషించడం భారమైంది. దీంతో కొంతకాలం హైదరాబాద్ లో పని చేశాడు. అయినా కుటుంబ పోషణ కష్టంగా అనిపించింది.  
దీంతో వికాస్‌ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి అక్కడ రెండేళ్లపాటు డ్రైవరుగా పనిచేశారు. 

కొన్ని నెలల క్రితం మరోసారి వెళ్లిన వికాస్‌ పని దొరకకపోవడంతో నెలన్నర క్రితం తిరిగి వచ్చేశారు. అయితే, మొదటిసారి దుబాయ్‌ వెళ్లినప్పుడు లాటరీ టికెట్లు కొనడం అలవాటు చేసుకున్నాడు. ఎన్నిసార్లు లాటరీ టికెట్ కొన్నా... అతనికి లాటరీ తగలకపోవడం గమనార్హం.

 ఈసారి తిరిగి  భారత్ కి వచ్చేసినప్పటికీ అక్కడి తన స్నేహితుడి ద్వారా మూడు టికెట్లు కొన్నారు. వాటిలో ఒక దానికి ఈ భారీ లాటరీ తగిలింది. ఈ నెల మూడో తేదీన తీసిన లాటరీలో ఓ టికెట్ వికాస్ కి తగిలింది. దీంతో ఆయన కు రూ.28కోట్లు లభించాయి.  ఈ టికెట్లు కొనడానికి విలాస్‌ తన భార్య పద్మ దగ్గరే రూ.20 వేలు అప్పు చేయడం గమనార్హం. వికాస్ కి 12, 6 సంవత్సరాల వయసుగల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తనకు లాటరీ దొరికినా కూడా వ్యవసాయం కొనసాగిస్తానని ఈ సందర్భంగా వికాస్ చెబుతున్నాడు. 

click me!