ఒకరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం...చివరకీ..

Published : Aug 05, 2019, 10:29 AM IST
ఒకరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం...చివరకీ..

సారాంశం

యువతితో పెళ్లికి ముందే కార్తీక్... 8 సంవత్సరాల నుంచి మరో యువతితో సహజీవనం చేస్తున్నట్లు తాజాగా ఆమెకు తెలిసింది. 8 సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదని సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయామంటూ గుర్తించిన ఇద్దరు యువతులను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. తీరా ఆమెను పెళ్లి బంధంలోకి తీసుకువెళ్లాడు. జీవితం సాఫీగా సాగిపోతోందని ఆనందపడిన ఆ యువతికి ఓ పిడుగులాంటి వార్త తెలిసింది. తనకన్నా ముందు నుంచే మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని తెలిసి షాకయ్యింది. తర్వాత తేరుకొని మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పెద్దపల్లికి చెందిన ఆకుదారి కార్తీక్(29) అనే వ్యక్తి బెంగళూరులో గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు.యూసఫ్ గూడ బస్తీలో ఉంటున్న సమయంలో ఓ ప్రైవేటు ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొద్ది రోజులు సహజీవనం చేశారు. అనంతరం ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు.

అయితే... ఈ యువతితో పెళ్లికి ముందే కార్తీక్... 8 సంవత్సరాల నుంచి మరో యువతితో సహజీవనం చేస్తున్నట్లు తాజాగా ఆమెకు తెలిసింది. 8 సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదని సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయామంటూ గుర్తించిన ఇద్దరు యువతులను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే