ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేరుకున్న మరో 145 మంది తెలుగు విద్యార్థులు..

Published : Mar 05, 2022, 03:07 PM IST
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేరుకున్న మరో 145 మంది తెలుగు విద్యార్థులు..

సారాంశం

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తాజాగా మరో 145 మంది ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు.  

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ సరిహద్దులకు  చేరుకుంటున్న విద్యార్థులను ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. మిగిలిన వారిని కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు స్వస్థలాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తాజాగా మరో 145 మంది ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి.. ఏపీకి చెందిన 83 మంది  విద్యార్థులు,  తెలంగాణకు చెందిన 62 మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. వారికి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన ఏపీ, తెలంగాణ అధికారులు.. వారిని ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లకు తరలించారు. అక్కడ వారికి అధికారులు వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక, శుక్రవారం వరకు తెలంగాణకు చెందిన 377 మంది విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. తాజాగా మరో 62 మంది ఢిల్లీ చేరుకోవడంతో.. వారిని స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్న భారతీయ విద్యార్థులు.. తమను ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తరలించేందుకు కృషి చేసిన ఎంబసీ అధికారులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు థాంక్స్ చెబుతున్నారు. 

ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో వారు అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. అక్కడ బాంబుల దాడులతో.. విద్యార్థులు బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. అయితే భారత ప్రభుత్వం అక్కడి చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ఆపరేషన్ గంగా చేపట్టింది.

ఉక్రెయిన్‌లోని ఎంబసీ అధికారులు నిత్యం విద్యార్థులకు సూచనలు చేస్తూ వారు ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి చేరుకునేలా చేస్తున్నారు. సరిహద్దు దేశాలకు చేరుకున్నవారిని అక్కడి నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వదేశానికి తరలిస్తున్నారు. భారతీయుల తరలింపును పర్యవేక్షించడానికి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు భారత ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను కూడా పంపింది. ఇక, ఉక్రెయిన్ ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu