హైదరాబాదీలకు నిరాశ .. అర్ధాంతరంగా నిలిపోయిన ఇండియా కార్ రేసింగ్ లీగ్

By Siva KodatiFirst Published Nov 20, 2022, 8:16 PM IST
Highlights

హైదరాబాద్‌లో తొలిసారిగా జరుగుతోన్న ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. వరుస ప్రమాదాలతో పాటు రేసర్లకు గాయాలవ్వడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. శనివారం టెస్ట్ రేస్‌లు నిర్వహించగా.. సమయం మించిపోవడంతో పూర్తి స్థాయి రేసులు నిర్వహించలేకపోయారు. అయితే ఆదివారం ఉదయం నుంచి రేస్‌లో ఐదు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక మహిళా రేసర్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ప్రమాదాల్లో గాయపడిన రేసర్లకు కూడా స్వల్ప గాయాలవ్వగా, కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఇండియా రేసింగ్ లీగ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మరోసారి ఫార్మూలా రేసింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ వేదికగా జరగనుంది. 

Also REad:ఇండియన్ రేసింగ్ లీగ్ లో ప్రమాదం: చెట్టు కొమ్మ విరిగిపడి రేసర్ కు స్వల్ప గాయాలు

కాగా... ఈ రేసింగ్ ను  చూసేందుకు  గ్యాలరీని  ఏర్పాటు  చేశారు నిర్వాహకులు.  బుక్  మై  షో  ద్వారా   ఈ  రేసింగ్ ను  చూసేందుకు  టికెట్లను  బుుక్ చేసుకోవచ్చు. అయితే   రేసింగ్ ప్రారంభమయ్యే  సమయానికి ప్రేక్షకులు  చాలా  తక్కువ  సంఖ్యలో  హాజరయ్యారు.  మూడు  విడతలుగా  నిర్వహించే  రేసింగ్  లో  వచ్చిన  పాయింట్ల  ఆధారంగా  విజేతను నిర్ణయిస్తారు. ఇండియన్ రేసింగ్  నేపథ్యంలో  హుస్సేన్  సాగర్ పరిసర ప్రాంతాల్లో  పోలీసులు  ట్రాఫిక్  ఆంక్షలను  విధించారు.  

click me!