స్వాతంత్య్ర వేడుకల సాక్షిగా... బిజెపి కార్పోరేటర్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 15, 2021, 10:14 AM IST
స్వాతంత్య్ర వేడుకల సాక్షిగా... బిజెపి కార్పోరేటర్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి (వీడియో)

సారాంశం

దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనే టీఆర్ఎస్-బిజెపి శ్రేణులు బాహాబాహీకి దిగిన సంఘటన హైదరాబాద్ మల్కాజిగిరి పరిధిలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా హైదరాబాద్ లో టీఆర్ఎస్, బిజెపి ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మల్కాజ్ గిరి జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బిజెపి కార్పోరేటర్ శ్రవణ్ పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా అతడిపై దాడికి యత్నించారు. దీంతో అతడు గాయపడ్డాడు.

స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎదుటే టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. బిజెపి కార్పోరేటర్ పై దాడి ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. అంతేకాదు వారి నుండి కెమెరా, సెల్ ఫోన్లు లాక్కుని పరారయ్యారు. 

వీడియో

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?