హైద్రాబాద్ నగరంలోని పలు రియల్ ఏస్టేట్ సంస్థలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి సోదాలు సాగుతున్నాయి.
హైదరాబాద్: నగరంలోని పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో మంగళవారంనాడు ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని గూగీ పౌండేషన్ , గూగీ గ్లోబల్ ప్రాజెక్టు లిమిటెడ్ , విహంగా చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, గూగీ ప్రాపర్టీస్ , ఫార్మా హిల్స్, వండర్ సిటీ , రాయల్ సిటీ, రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని 20 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో ఉన్న గూగీ ప్రాపర్టీస్ కార్పోరేట్ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగీ ప్రాపర్టీస్ సంస్థకు చెందిన డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.రియల్ ఏస్టేట్ సంస్థలు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ విషయంలో అనుమానాలతో అధికారులు సోదాలు చేస్తున్నారు.
undefined
also read:ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సర్వే
గతంలో కూడా హైద్రాబాద్ నగరంలోని పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ రియల్ ఏస్టేట్ సంస్థలు భారీగా వ్యాపారాలు నిర్వహించి తప్పుడు లెక్కలతో రిటర్న్స్ సమర్పిస్తున్నాయని ఆదాయ పన్ను శాఖాధికారులు ఆరోపిస్తున్నారు. ఈ అనుమానాలతో గతంలో సోదాలు నిర్వహించిన ఐటీ శాఖాధికారులు పలు సంస్థలపై కేసులు కూడా నమోదు చేశారు.
పలు సంస్థల నుండి రియల్ ఏస్టేట్ సంస్థల్లోకి నిధులు మళ్లిన విషయాలను కూడా ఈ సోదాల సందర్భంగా ఐటీ అధికారులు గుర్తించారు. అయితే ఇవాళ నిర్వహిస్తున్న సోదాల్లో కూడా ఆయా సంస్థల నుండి కీలక సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరించారని తెలుస్తుంది.