మంత్రి మల్లారెడ్డి తమ విధులకు ఆటంకం కల్గించారని ఐటీ శాఖాధికారులు శుక్రవారంనాడు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
హైదరాబాద్:మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐటీ శాఖాధికారులు తెలంగాణ హైకోర్టులో శుక్రవారంనాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ విదులకు మంత్రి మల్లారెడ్డి ఆటంకం కల్గించారని కూడ ఐటీ శాఖ తెలిపింది.
బుధవారంనాడు రాత్రి ఐటీ సోదాల సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. తన పెద్ద కొడుకు మహేందర్ రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకం చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఐటీ అధికారలు తయారు చేసిన స్టేట్ మెంట్ పై మహేందర్ రెడ్డితో సంతకం చేయించారన్నారు. ఆసుపత్రిలో ఉన్న మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం చేయించారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఈ విషయమై ఐటీ అధికారి రత్నాకర్ పై మంత్రి మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ పిర్యాదు మేరకు పోలీసులు ఐటీ అధికారులపై కేసు నమోదు చేశారు. మరో వైపు ఐటీ అధికారుల ఫిర్యాదు మేరకు మంత్రి మల్లారెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
undefined
also read:మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌లోనే ఐటీ అధికారి ల్యాప్ టాప్
గురువారం నాడు ఉదయంతో మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులకు చెందిన బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు తీసుకెళ్లారు.ఐటీ అధికారుల బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు.మంత్రి మల్లారెడ్డి సహా 16 మందిని విచారణకు రావాలని ఇప్పటికే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల ఆధారంగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు విచారణకు హాజరు కానున్నారు.
మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీకి చెందిన సుమారు 50 మంది బృందాలు సోదాలు చేశాయి. ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. ఈ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. కక్షపూరితంగానే తమపై దాడులు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
తనపై ఇప్పటికే మూడు దఫాలు ఐటీ సోదాలు జరిగాయని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. గతంలో రెండు దఫాలు ఐటీ సోదాలు జరిగిన విషయాన్ని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఇండియాలో లేడు. టర్కీలో విహారయాత్రకు వెళ్లిన మర్రి రాజశేఖర్ రెడ్డి హుటాహుటిన టర్కీ నుండి హైద్రాబాద్ కు తిరిగి వచ్చాడు. ఢిల్లీ ఆదేశాలతోనే ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. పార్టీ మారాలనే ఉద్దేశ్యంతోనే ఐటీమ సోదాలు నిర్వహించారని కూడా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.