వంశీరామ్ బిల్డర్స్ సంస్థలో ఐటీ సోదాలు ఇవాళ ఉదయం ముగిశాయి. ఆరు రోజుల పాటు సోదాలు సాగాయి. పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారని సమాచారం.
హైదరాబాద్: ప్రముఖ రియల్టర్ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ సంస్థల్లో ఐటీ సోదాలు ఆదివారం నాడు ముగిశాయి. ఆరు రోజులుగా వంశీరామ్ బిల్డర్స్ సంస్థ యజమాని సుబ్బారెడ్డి ఆయన బావ మరిది జనార్ధన్ రెడ్డితో పాటు పలువురి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీ రాష్ట్రానికి చెందిన వైసీపీ నేత దేవినేని అవినాష్ నివాసం కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. సుమారు 20 టీముల ఐటీ అధికారుల బృందం రెండు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.
వంశీరామ్ బిల్డర్స్ కు చెందిన సుబ్బారెడ్డి ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. అంతేకాదు వంశీరామ్ బిల్డర్స్ డెరెక్టర్లు జ్యోతి, శైలజారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో బంగారం సహా, నగదుతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. 22 బ్యాంకు ఖాతా పుస్తకాలను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారు.గత నాలుగేళ్లలో ఈ సంస్థ నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు.
undefined
also read:వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు.. వెలుగులోకి మరిన్ని అక్రమాలు
వంశీరామ్ గ్రూప్ లో పెట్టుబడి పెట్టిన స్లీపింగ్ పార్ట్‌నర్ల కలిగి ఉన్న అగ్రిమెంట్ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం. కానీ ఈ వివరాలు ఆడిట్ నివేదికలో పేర్కొనలేదు.ఈ సంస్థకు చెందిన కొన్ని ఈ మెయిల్స్ , లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.సుబ్బారెడ్డికి చెందిన పలు లావాదేవీలు, ఈ సంస్థ డైరెక్టర్ల ఖాతాలను ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం.