వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్

By Siva Kodati  |  First Published Sep 28, 2023, 5:06 PM IST

తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది . హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై వుంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 


తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై వుంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. నిర్మిల్, కామారెడ్డి, భద్రాద్రి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

మరోవైపు.. నిన్నటి నుంచి హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, చార్మినార్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో గణేశ్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వినాయకులను తీసుకొస్తున్న వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతూ వుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. 
 

Latest Videos

click me!