మీర్‌పేట్‌లో విషాదం.. సంధ్య అనే విద్యార్థిని...

By Rekulapally SaichandFirst Published Nov 4, 2019, 12:21 PM IST
Highlights

ఒత్తిడి.. ఆత్మన్యూనతా భావం.. కారణాలు ఏవైనా భావి భారతాన్ని బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తోంది. హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంధ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ మేనేజ్‌మెంట్ వేధింపుల కారణంగానే మనస్థాపానికి గురై ఆత్మహత్యకు చేసుకుందాని బంధువులు  ఆరోపిస్తున్నారు. 
 

హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంధ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ మేనేజ్‌మెంట్ వేధింపుల కారణంగానే మనస్థాపానికి గురై 
ఆత్మహత్యకు చేసుకుందాని బంధువులు  ఆరోపిస్తున్నారు.

 టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలలో మూడవ సంవత్సరం చదువుతున్న సంధ్యను  మేనేజ్‌మెంట్ గత కొన్ని రోజులుగా  వేధింపుల గురుచేస్తున్నట్లుగా ఆమె స్నేహితులు తెలిపారుసంద్య అనూహ్యంగా మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.  కుమార్తె ఇక లేడని తెలిసిన తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. 

పెళైన పనిమనిషిపై కన్ను... కులం పేరుతో ధూషించి...

సంధ్య మృతిపై కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో విద్యార్థుల మరణాలు ఏటిఏటికి పెరుగుతున్నాయి.
పరీక్షల ఓత్తిడి, తల్లిదండ్రుల మందలింపు, ప్రేమ వ్యవహారాల కారణంగా విద్యార్థులు భవన్మరణానికి పాల్పడుతున్నారు. నేటి మార్గదర్శాకులుగా నిల్వవాల్పిన వారు ఇలా ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.

తల్లిని చంపిన కీర్తి: చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక నిఘా
ఒత్తిడి.. ఆత్మన్యూనతా భావం లాంటివి కారణాలతో బలిపీటలపైకి ఎక్కుతున్నాయి. ర్యాంకులు, మార్కుల గోలలో పడి పిల్లలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది.తల్లిదండ్రులు, విద్యాసంస్ధల యజమాన్యాల తీరు వారిని నిరాశ, నిస్పృహల్లో నెడుతుంది.

ఇటివలే   ఐఐటీ-హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి బలవన్మరణం అందరినీ కలచివేసింది. ఇప్పడు సంధ్య అత్మహత్య చేసుకోవడం వారిపై ఓత్తిడి తీవ్రత ఎంత ఉందో అర్ధమవుతుంది. విద్యార్ధుల మరణాలు అగాలిఅంటే విద్యాపరమైన అంశాలతోపాటు వారికి జీవిత పాఠాలు నేర్పించాలని నిపుణులు అంటున్నారు. 

click me!