హైదరాబాద్‌ ఐఐటీలో విషాదం: విద్యార్ధి ఆత్మహత్య

By sivanagaprasad KodatiFirst Published Oct 29, 2019, 1:07 PM IST
Highlights

హైదరాబాద్ ఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌ 3వ సంవత్సరం చదువుతున్న పి.సిద్ధార్థ్ అనే విద్యార్ధి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు

హైదరాబాద్ ఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌ 3వ సంవత్సరం చదువుతున్న పి.సిద్ధార్థ్ అనే విద్యార్ధి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయం బిల్డింగ్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సిద్ధార్థ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం హైదరాబాద్. సిద్ధార్థ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

నిజామాబాద్‌లో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీమేధా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదవుతున్న వర్ష... కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకింది. వెంటనే స్పందించిన కళాశాల యాజమాన్యం, తోటి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Also Read:నిజామాబాద్: బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

అక్కడ చికిత్స పొందుతూ వర్ష మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన శ్రీహర్ష... బెంగళూరులోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.

హాస్టల్‌లో సరైన మౌలిక వసతులు లేవని యజమాన్యంపై శ్రీహర్ష ప్రశ్నించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలేజీ యాజమాన్యం శ్రీహర్షను సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న సంఘటనలతో మనోవ్యధకు గురైన విద్యార్ధి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read:ఖమ్మం: ఆర్టీసీ కండక్టర్ మృతదేహం కోసం తోపులాట (వీడియో)

అతని బలవన్మరణంతో విద్యార్ధులు భగ్గుమన్నారు. కాలేజీ యాజమాన్యం తీరు వల్లే శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆందోళనకు దిగారు.

కళాశాల, హాస్టల్‌లో సరైన నీరు, మంచి భోజనం లభించడం లేదన్న కారణంతో శ్రీహర్ష పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు అతడిపై పగ పెంచుకుని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని.. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లు, విద్యార్ధులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ కుమారుడి మరణంతో శ్రీహర్ష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మరో కేసులో వాసుయాదవ్ అనే 12ఏళ్ల విద్యార్థి డెహ్రాడూన్ లోని  ఓ బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్నాడు. కాగా.. తన సీనియర్స్ తో జరిగిన గొడవ పెద్దదిగా మారడంతో.. వాసుని సీనియర్స్ క్రికెట్ బ్యాట్స్ తో కొట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే బాలుడిని  వైద్యులకు చూపించారు.

click me!