రూ.2, రూ.5 నాణెలు ఇస్తే రూ.లక్షలు ఇస్తామంటూ వచ్చే ప్రకటనలు, మెసేజ్ లు, లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. అయోధ్య పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇటీవల ఆన్ లైన్ మోసాలు సాధారణం అయిపోయాయి. ఏటీఎం కాలపరిమితి ముగిసిందని, ఓటీపీ చెబితే కొత్త ఏటీఎం పంపిస్తామని నమ్మించడం, మీకు లాటరీలో లక్షలు వచ్చాయని, మినిమం ఛార్జీలు పే చేస్తే ఆ మొత్తం మీ సొంతం అవుతుందని మోసం చేయడం వంటి మోసాలన్నో జరుగుతున్నట్టు తరచూ వార్తల్లో వస్తున్నాయి. అయితే వీటిపై ప్రజల్లో కొంత అవగాహన పెరగడంతో ఆ మోసాలు తగ్గుముఖం పట్టాయి.
తొలిరోజే అయోధ్య రామయ్య అద్భుత రికార్డు... ఏకంగా 5 లక్షలమందా...!
పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకొని కేటుగాళ్లు రూటు మార్చారు. ప్రజల బలహీనతలే ఆసరాగా మలుచుకొని కొత్త పంథా మోసాలకు దిగుతున్నారు. పురాతన నాణెలు సేకరించే హాబీ ఉందని చెబుతూ, అలాంటివి తమకిస్తే రూ.లక్షలు ముట్టచెబుతామని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిని నమ్మిన వారి జేబు గుల్ల చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పురాతన నాణెలు సేకరించే హాబీ కొంత మందికి ఉంటుందనే విషయం అందరికీ కొంత అవగాహన ఉంది. అయితే దీనినే ఆసరగా చేసుకొని, అలాంటి నాణెలు ఉన్న వారినే టార్గెట్ చేస్తూ కొంత మంది మోసగాళ్లు కొత్త రకం స్కామ్ కు తెరలేపారు. అయితే దీనిపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Mallu Bhatti Vikramarka : "ఖర్చులు తగ్గించండి.. ఆదాయం పెంచండి .. "
ఇందిరాగాంధీ బొమ్మ, భారతదేశం మ్యాప్ ఉన్ననాణెలు తమకు కావాలని, వాటిని ఇస్తే భారీగా డబ్బులు ముట్టచెబుతామని నమ్మిస్తున్నారని పేర్కొన్నారు. వాటికి ఆశపడి ముందడుగు వేస్తే పలు రకాల ఛార్జీల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇలా అమాయకుల నుంచి అందినకాడికి దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి స్కామ్ ల బారిన పడకూడదని సూచించారు. ఈ విషయంలో మోసపోయిన బాధితులు, లేదా మోసం జరిగినట్టుగా గుర్తించిన వారు 1939 అనే నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
Narendra Modi YouTube channel: గత రికార్డులను బ్రేక్ చేసిన 'నరేంద్ర మోదీ'యూట్యూబ్ ఛానెల్ ..
దీంతో పాటు 87126 72222 అనే నెంబర్ కు వాట్సప్ లో కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. అలాగే www.cybercrime.gov.in లో ఆన్ లైన్ కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అయోధ్య పేరుతో సైతం మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.