మిర్యాలగూడ స్మశానవాటికలో ఉద్రిక్తత, నాన్నను చూడలేదు: అమృత

Published : Mar 09, 2020, 01:25 PM ISTUpdated : Mar 09, 2020, 05:05 PM IST
మిర్యాలగూడ స్మశానవాటికలో ఉద్రిక్తత, నాన్నను చూడలేదు: అమృత

సారాంశం

తన తండ్రిని కడసారి కూడ చూడలేదని మారుతీరావు కూతురు అమృత చెప్పా,రు. మారుతీరావు అంత్యక్రియల సమయంలో అమృత  స్మశానవాటికకు చేరుకొంది. ఈ సమయంలో అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అమృతను పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు.  

మిర్యాలగూడ:  తన తండ్రి మృతదేహం చూడలేదని మారుతీరావు కూతురు అమృత చెప్పా,రు. మారుతీరావు అంత్యక్రియల సమయంలో అమృత  స్మశానవాటికకు చేరుకొంది మారుతీరావు అంత్యక్రియల సమయంలో అమృత  స్మశానవాటికకు చేరుకొంది. ఈ సమయంలో అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అమృతను పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు.

ప్రణయ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న  మారుతీరావు హైద్రాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో  ఈ నెల 8వ తేదీన ఆత్మహత్య  చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్న మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో సోమవారం నాడు నిర్వహించారు.

Also read:మిర్యాలగూడ స్మశాన వాటికలో ఉద్రిక్తత: అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు

ఈ అంత్యక్రియలకు అమృత పోలీస్ రక్షణగా స్మశానవాటికకు చేరుకొన్నారు. మిర్యాలగూడ స్మశానవాటికలో మారుతీరావు మృతదేహాన్ని చూసేందుకు అమృత వెళ్లింది ఈ సమయంలో అక్కడే ఉన్న వారంతా అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అమృత గో బ్యాక్ అంటూ అమృత వైపుకు వచ్చే ప్రయత్నం చేశారు

ఈ సమయంలో అమృతకు  పోలీసుల రోప్ పార్టీ రక్షణగా నిలిచింది. మారుతీరావు మృతదేహం చూడకుండానే అమృత ఇంటికి  చేరుకొంది.  స్మశానవాటికలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.  నాన్నను చూడలేదని ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.తాను కారులో ఉన్న సమయంలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. నాన్నను చివరి చూపు చూడకుండానే వచ్చినట్టుగా ఆమె చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?