సంచలనం: రాహుల్‌గాంధీకి కోమటిరెడ్డి బంపర్ ఆఫర్

First Published May 30, 2018, 2:16 PM IST
Highlights

హాట్ న్యూస్


హైదరాబాద్:ఎమ్మెల్యేల అనర్హత కేసులో జూన్ 4వ తేదిన  కోర్టు ధిక్కరణ కేసును  దాఖలు చేయనున్నట్టు  నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

ఈ ఏడాది మార్చి 12వ తేదిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన
నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే
  సంపత్ కుమార్ లు  హెడ్‌ఫోన్లు విసిరారు.ఈ ఘటనలో శాసనమండలి ఛైర్మెన్  స్వామిగౌడ్  కంటికి గాయమైంది. 

దీంతో నల్గొండ , ఆలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ  స్పీకర్ మధుసూధనాచారి నిర్ణయం తీసుకొన్నారు.

స్పీకర్ నిర్ణయాన్ని నిరసస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు హైకోర్టును ఆశ్రయించారు.ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు  2018 ఏప్రల్ 17వ
తేదిన తుది తీర్పును వెలువరించింది.

ఎమ్మెల్యేల శాసనసభసభ్యతవాల రద్దును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా డిమాండ్  
చేస్తున్నారు. కానీ, ఈ
విషయమై సరైన స్పందన లేదనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

కోర్టు తీర్పును అమలు చేయనందుకు గాను  జూన్ 4వ తేదిన  మరోసారి కోర్టును ఆశ్రయించనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

పీసీసీ చీప్ పదవి ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయను

పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.పీసీసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లను ఎఐసీసీలోకి
తీసుకోవాలని ఆయన సూచించారు.తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన చెప్పారు.

తనకు ఎలాంటి పదవులు అవసరం  లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన సమయంలో తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు.  పీసీసీ చీప్ పదవికి తాను అర్హుడినేనని
ఆయన చెప్పారు. పీసీసీ  పదవి తనకు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేసేందుకు తాను శక్తవంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు.


 

click me!