గోదావరి వరదలో చిక్కుకున్న ఇద్దరు .. ట్యాంక్‌పైకెక్కి ఆర్తనాదాలు, రక్షించిన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ (వీడియో)

Siva Kodati |  
Published : Jul 14, 2022, 10:08 PM IST
గోదావరి వరదలో చిక్కుకున్న ఇద్దరు .. ట్యాంక్‌పైకెక్కి ఆర్తనాదాలు, రక్షించిన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ (వీడియో)

సారాంశం

మంచిర్యాల జిల్లాలో గోదావరి వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు హెలికాఫ్టర్ సాయంతో రక్షించారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరిన హెలికాఫ్టర్ బాధితులను రక్షించింది.   

మంచిర్యాల జిల్లాలో (mancherial) గోదావరిలో (godavari floods) చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు పోలీసులు. ఎడ్ల కోసం గోదావరి ఒడ్డుకు వెళ్లిన గట్టయ్య , సారయ్యలు సోమనపల్లిలో వరద నీటిలో చిక్కుకున్నారు. దీంతో దగ్గరలోని వాటర్ ట్యాంక్ ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి వాటర్ టాంక్ పైనే వున్నారు ఇద్దరు బాధితులు. దీంతో హెలికాఫ్టర్ ద్వారా వారిని రక్షించారు అధికారులు. 

సికింద్రాబాద్‌లోని హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ (hakimpet air force station) ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్ పంపాలంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చింది. గోదావరి వరద పోటెత్తడంతో వాటర్ ట్యాంక్‌పై చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించాలని ప్రభుత్వం కోరింది. వెంటనే స్పందించిన వాయుసేన అధికారులు మంచిర్యాలకు చేతక్ హెలికాఫ్టర్ ను పంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పైలట్‌లు పరిస్ధితిని అంచనా వేశారు. తక్షణం ఇద్దరు వ్యక్తులు వున్న వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని హెలికాఫ్టర్‌లోకి ఎక్కించారు. 

Also Read:మంచిర్యాలను ముంచెత్తిన వరద.. గోదావరిలో ట్యాంక్‌పైనే ఇద్దరు, హెలికాఫ్టర్లతో రక్షించిన అధికారులు

ఇలాంటి ప్రమాదకరమైన ఆపరేషన్‌ను నిర్వహించేందుకు పైలట్లకు అపారమైన నైపుణ్యం, ఏకాగ్రత అవసరం. కానీ వాయుసేన పైలట్లు అత్యంత చాకచక్యంగా ఇద్దరు బాధితులను రక్షించి అధికారులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు, బాధిత కుటుంబ సభ్యులు ... భారత వాయుసేనకు, పైలట్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా.. మంచిర్యాల పట్టణంలో వరద నీరు ముంచెత్తింది. మరో వైపు గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉందని  స్థానికులు ఆందోళన చెందుతున్నారు.మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ,, రాం నగర్,  పద్మశాలీ కాలనీ సహా పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. రాళ్లవాగు,తోళ్లవాగుల నుండి వరద నీరు మంచిర్యాల పట్టణంలోని  పలు కాలనీలను ముంచెత్తాయి. వీటి కారణంగానే మరింత వరద పట్టణంలోకి వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 54 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్దుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 54 గేట్లు ఎత్తి 1.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  వరద నీరు ముంచెత్తడంతో  ఇప్పటికే మంచిర్యాల, నిజామాబాద్ మధ్య రాకపోకలునిలిచిపోయాయి.  మరోవైపు మంచిర్యాల నిజామాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి.  మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపం సమీపంలోని ఇంటిలో ఓ వ్యక్తి నిన్న చిక్కుకున్నారు. తనను కాపాడాలని ఆయన ఆర్తనాదాలు చేశారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం