సికింద్రాబాద్- నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం

Siva Kodati |  
Published : Jul 14, 2022, 09:07 PM IST
సికింద్రాబాద్- నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం

సారాంశం

సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు కలకలం రేపాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు.

సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు కలకలం రేపాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. తోటి ప్రయాణీకుడితో గొడవపడి కాల్పులు జరిపాడు ఆగంతకుడు. వెంటనే కాగజ్‌నగర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఆర్మీ జవాన్‌గా గుర్తించినట్లు ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు
VB-G RAM G : కూలీలకు నిరుద్యోగ భృతి.. అందకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి