లోటస్‌పాండ్‌లో షర్మిల: వైఎస్ఆర్ అభిమానులకు అభివాదం

Published : Feb 09, 2021, 12:16 PM IST
లోటస్‌పాండ్‌లో షర్మిల: వైఎస్ఆర్ అభిమానులకు అభివాదం

సారాంశం

హైద్రాబాద్‌లోని లోటస్ పాండ్  వద్దకు చేరుకొన్న వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ షర్మిల అభివాదం చేశారు. 

హైదరాబాద్: హైద్రాబాద్‌లోని లోటస్ పాండ్  వద్దకు చేరుకొన్న వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ షర్మిల అభివాదం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన వైఎస్ అభిమానులతో షర్మిల మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు.ఆహ్వానం అందుకొన్న నేతలకు మాత్రమే  లోటస్‌పాండ్ లోకి అనుమతి లభించింది.

also read:వైఎస్ఆర్ అభిమానులతోసమావేశం: అందరి చూపు షర్మిల వైపే

ఈ సమావేశం గురించి తెలుసుకొని లోటస్ పాండ్ వద్దకు చేరుకొన్న అభిమానులకు ఆమె అభివాదం చేశారు. షర్మిల రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

షర్మిలపై అభిమానులు కాగితపు పూల వర్షం కురిపించారు.లోటస్ పాండ్ వద్ద బాణసంచా కాల్చి అభిమానులు తమ సంబరాన్ని వ్యక్తం చేశారు.పార్టీ ఏర్పాటు విషయమై షర్మిల కొందరు కీలక నేతలతో ఇప్పటికే చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఈ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu