అనుచరులతో చర్చించిన తర్వాతే నిర్ణయం: కాంగ్రెస్‌లో చేరికపై కడియం

By narsimha lodeFirst Published Mar 29, 2024, 1:59 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు  వచ్చిన ఆహ్వానంపై  తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని  కడియం శ్రీహరి ప్రకటించారు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరాలని  దీపాదాస్ మున్షితో పాటు ఆ పార్టీ కీలక నేతలు  తనను కోరినట్టుగా  మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. 
శుక్రవారం నాడు  దీపాదాస్ మున్షి భేటీ ముగిసిన తర్వాత  కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు గాను  పార్టీలో చేరాలని  ఆహ్వానించినట్టుగా  కడియం శ్రీహరి చెప్పారు.

అయితే  ఈ విషయమై తాను తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన  వ్యాఖ్యానించారు. వరంగల్ ఎంపీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కడియం శ్రీహరి చెప్పారు.  తాను  కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు.కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడడంపై  అనేక రకాల కారణాలున్నాయని  కడియం శ్రీహరి  చెప్పారు. బీఆర్ఎస్ గ్రౌండ్ లో లెవల్లో  రోజు రోజుకు పడిపోతుందని ఆయన  చెప్పారు.  అంతకుముందు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరిని  కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్టుగా  చెప్పారు.

బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా  గద్వాల విజయలక్ష్మి నిన్న ప్రకటించారు. నిన్న కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత  కేశవరావు మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నట్టుగా ప్రకటించారు. ఇవాాళ ఉదయం  సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు.  

 

click me!