మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఇవాళ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు.
హైదరాబాద్: మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ శుక్రవారం నాడు భేటీ అయ్యారు. కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టిక్కెట్టు కేటాయించింది. అయితే ఈ నెల 28వ తేదీన వరంగల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేయబోనని కావ్య ప్రకటించారు.ఈ మేరకు కేసీఆర్ కు లేఖ రాశారు. కడియం కావ్యతో పాటు కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
బీఆర్ఎస్ కు చెందిన మరికొందరు నేతలు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.అయితే ఈ విషయమై స్పష్టత రానుంది. స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి కడియం శ్రీహరి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కడియం శ్రీహరికి పార్టీలో సముచిత స్థానం ఇవ్వనుందని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
undefined
Congress leaders at BRS MLA Kadiyam Srihari house
- He will Join the Congress Party
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంటి లో కాంగ్రెస్ నేతలు
- ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి, రోహిత్ చౌదరీ, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి, తదితరులు.
•
•… pic.twitter.com/wERIP6zLVL
కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కడియం శ్రీహరిని దీపాదాస్ మున్షి ఆహ్వానించారు. ఇవాళ ఉదయమే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు సీఎం అనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కేశవరావు, ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.