దమ్ముంటే ఆ పని చేయండి.. పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈటల సవాలు..

By Sumanth KanukulaFirst Published Aug 8, 2022, 5:05 PM IST
Highlights

పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట రాజేందర్ సవాలు విసిరారు. గెలిచిన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలంటే దమ్ముండాలని కామెంట్ చేశారు. 

పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట రాజేందర్ సవాలు విసిరారు. గెలిచిన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలంటే దమ్ముండాలని కామెంట్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే 5 నిమిషాల్లో ఆమోదించారని చెప్పారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు పార్టీ మారి.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని అన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే.. రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలని సవాలు విసిరారు. 

ఇదిలా ఉంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను రాజగోపాల్ రెడ్డి సోమవారం శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. రాజీనామా లేఖను అందజేసిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో.. మునుగోడు శాసనసభ స్థానం ఖాళీ గురించి త్వరలోనే ఎన్నికల సంఘానికి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. దీంతో నిబంధనల ప్రకారం మునుగోడు‌ శాసన సభ స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వాహించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

అంతకు ముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోనని చెప్పారు. తన మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామ చేసి తీర్పు కోరానని తెలిపారు. దైర్యం లేకపోతే తాను ఈ పని చేసేవాడిని కాదని చెప్పారు. తనపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

click me!