ఈ ‘పిట్ట’ పెన్నుకు రెండు వైపుల పదునే..

First Published Mar 13, 2017, 10:32 AM IST
Highlights

టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఉద్యమస్ఫూర్తిపై గతంలో ఓ పుస్తకం రాసిన జేఏసీ బహిష్కృత నేత పిట్టల రవీందర్ ఇప్పుడు అదే కోదండరాంను విమర్శిస్తూ మరో పుస్తకం తీసుకొస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ రాజకీయ జేఏసీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పిట్టల రవీందర్ స్వరం పెంచుతున్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రెస్ మీట్ లు పెట్టి మరీ కోదండరాం వ్యవహార శైలిపై ఆయన విరుచకపడ్డారు.

 

ఇప్పుడు మరో రూట్ లో కోదండరాంను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. స్వతహాగా జర్నలిస్టు అయిన పిట్టల .. జేఏసీలో కోదండరాం ఏలా వ్యవహరించేవారనే దానిపై త్వరలో ఒక పుస్తకం తీసుకరానున్నట్లు తెలిసింది.

 

ఆ పుసక్తంలో ఎవరికీ తెలియని కోదండరాం అంతర్ముకుణ్ని బయటి ప్రపంచానికి పరిచయం చేస్తారట. ఆ పుస్తకానికి ‘పాలిటిక్స్‌ ఆఫ్‌ ఎ పొలిటికల్‌ టీచర్‌’ అనే పేరును ఖరారు చేశారట.

 

పిట్టల జేఏసీ కన్వీనర్ గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం, టీ జేఏసీ పాత్రపై పలు పుస్తకాలు రాశారు.

 

ఉద్యమ డైరీ పేరుతో ఆయన తీసుకొచ్చని పుస్తకం మంచి ఆదరణ పొందింది. అలాగే, సింగరేణిలో కార్మికుల కష్టాలపై కూడా ఆయన పలు పుస్తకాలు వెలువరించారు.

 

తెలంగాణ ఉద్యమంపై కోదండరాంకు ఉన్న స్ఫూర్తిని ప్రశంసించేలా  ఆయన గతంలోనే ‘కోదండరామ్‌తో పదేండ్ల ప్రయాణం-ఉద్యమ అనుభవాలు’ పేరుతో ఓ పుస్తకం తీసుకొచ్చారు. ఇప్పుడే అదే కోదండరాంను విమర్శిస్తూ ‘పాలిటిక్స్‌ ఆఫ్‌ ఎ పొలిటికల్‌ టీచర్‌’ పేరుతో ఇంగ్లిష్‌లో పుస్తకం తీసుకొస్తుండటం గమనార్హం.

 

పదునైన పెన్నున్న జర్నలిస్టు కాబట్టి  ఓకే అంశాన్ని రెండు  విధాలుగా, ఓకే వ్యక్తిని రెండు కోణాలో దర్శించి రాయడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే జేఏసీలోని కొందరు నేతలను ప్రలోభ పెట్టేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఇటీవల ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై మాత్రం పిట్టల నోరే మెదపడం లేదు.

 

 

click me!