కేసీఆర్ పేరుతో పథకం.. బడ్జెట్ లో ఇదే హైలెట్

First Published Mar 13, 2017, 9:26 AM IST
Highlights
  • శిశువుల కోసం కేసీఆర్ కిట్ 

తెలంగాణ బడ్జెట్ కులవృత్తులకు పెద్ద పీఠ వేసింది. సంక్షేమ రంగానికి మరోసారి ఎక్కువ నిధులు కేటాయించింది. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు బడ్జెట్ లో అందరినీ ఆకర్షించిందో పథకం. స్వయంగా సీఎం కేసీఆర్ పేరుతో ఈ పథకం వస్తోంది.

 

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీల ప్రసవం అనంతరం పుట్టిన శిశువులకు 16 రకాల వస్తువులను అందజేస్తారు. ఈ పథకానికి  కేసీఆర్ కిట్ అనే పేరు పెట్టారు.

ఈ కిట్లో నవజాత శిశువులకు మూడు నెలల వరకు ఉపయోగపడే విధంగా సబ్బులు, బేబీ ఆయిల్, చిన్న పిల్లల పరుపు, దోమతెర, డ్రస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగు, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులుంటాయి.  వీటి విలువ మార్కెట్ లో రూ. 4 వేల పైచిలుకే ఉంటుందని తెలిసింది.

 

ఈ పథకం కోసం ఈ సారి బడ్జెట్‌లో రూ. 605 కోట్లు కేటాయించడం గమనార్హం.ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలు ప్రసవం అనంతరం రూ. 12వేలు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానితో పాటు ఈ కేసీఆర్ కిట్ ను కూడా అందిస్తారు.

 

click me!