వైఎస్ఆర్ వర్ధంతి సభకు వెళ్తున్నా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Published : Sep 02, 2021, 04:40 PM IST
వైఎస్ఆర్ వర్ధంతి సభకు వెళ్తున్నా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా  వైఎస్ విజయమ్మ నిర్వహించే ఆత్మీయ సమావేశానికి తాను హాజరౌతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. 

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి  తాను వెళ్తున్నట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.ఈ సమావేశానికి ఎవరూ కూడా వెళ్లోద్దని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఈ మేరకు ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.

వైఎస్ఆర్ సంస్మరణ సభకు తనకు ఆహ్వానం అందిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి తాను హాజరుకానున్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు.వైఎస్ఆర్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తాను ఈ సమావేశానికి వెళ్తున్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశం రాజకీయాలకు అతీతమని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్ తో సన్నిహితంగా మెలిగిన సుమారు 300 మందికి ఈ సమావేశానికి విజయమ్మ ఆహ్వానాలు పంపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పార్టీల్లోని నేతలకు విజయమ్మ ఆహ్వానాలు పంపింది. అయితే  ఈ సమావేశానికి  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి ఎవరెవరు హాజరౌతారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?