న్యాయం చేయకపోతే రెబెల్‌గా పోటీ: సమ్మయ్య షాక్

By narsimha lodeFirst Published Oct 11, 2018, 6:36 PM IST
Highlights

సిర్పూర్ కాగజ్ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్‌లో అసమ్మతి తలెత్తింది. 

సిర్పూర్:సిర్పూర్ కాగజ్ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్‌లో అసమ్మతి తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు.  తనకు న్యాయం చేయకపోతే  రెబెల్‌‌గా పోటీ చేస్తానని చెప్పారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  సిర్పూర్ నుండి కావేటీ సమ్మయ్య టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.  అయితే ఆ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  కోనేరు కోనప్ప విజయం సాధించారు. 

2010లో జరిగిన  ఉప ఎన్నికల్లో  సిర్పూర్ నుండి  కావేటి సమ్మయ్యపై ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ ఎన్నికల్లో సమ్మయ్య టీఆర్ఎస్  అభ్యర్థిగా  పోటీ చేశారు.  ఈ ఎన్నికల్లో ఇంద్రకరణ్‌రెడ్డిపై సమ్మయ్య  విజయం సాధించారు.2014 ఎన్నికల్లో సమ్మయ్య  ఓటమి పాలయ్యారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలో  రాజకీయ పార్టీల పునరేకీకరణ నేపథ్యంలో బీఎస్పీ నుండి విజయం సాధించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(నిర్మల్), సిర్పూర్ నుండి విజయం సాధించిన కోనేరు కోనప్పలు టీఆర్ఎస్ లో చేరారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో సిర్పూర్ స్థానం నుండి కోనప్పకు మరోసారి కేసీఆర్ అవకాశం కల్పించారు.  అయితే  సిర్పూర్ నుండి  సమ్మయ్య టిక్కెట్టు ఆశిస్తున్నాడు. బీసీలు ఎక్కువగా ఉన్న సిర్పూర్ నియోజకవర్గంలో తనకు కాకుండా కోనప్పకు టిక్కెట్టు కేటాయించడాన్ని  సమ్మయ్య వ్యతిరేకిస్తున్నారు. 

తనపై అధి ష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని చెబుతున్నారు సమ్మయ్య. హైకమాండ్‌ పునారాలోచించి నిర్ణయం తీసుకోకుంటే రెబల్‌గా బరిలో ఉంటానని సమ్మయ్య పార్టీకి అల్టిమేటం ఇచ్చారు.

click me!