బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా: దామోదర భార్య పద్మిని రెడ్డి

Published : Oct 11, 2018, 02:36 PM ISTUpdated : Oct 11, 2018, 02:53 PM IST
బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా:  దామోదర భార్య పద్మిని రెడ్డి

సారాంశం

తాను బీజేపీలో చేరే విషయమై  మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు తెలిపినట్టు ఆయన సతీమణి పద్మినిరెడ్డి తెలిపారు.


హైదరాబాద్: తాను బీజేపీలో చేరే విషయమై  మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు తెలిపినట్టు ఆయన సతీమణి పద్మినిరెడ్డి తెలిపారు.

గురువారం నాడు  బీజేపీలో చేరిన  తర్వాత  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి  ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. బీజేపీలో చేరే విషయాన్ని తాను ముందుగానే దామోదర రాజనర్సింహకు చెప్పానన్నారు. ఈ దఫా తాను కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ప్రయత్నం చేయలేదన్నారు.

సంగారెడ్డి టిక్కెట్టు తనకు ఇస్తామని  బీజేపీ నేతలు  ఆఫర్ ఇచ్చారని ఆమె చెప్పారు.  అంతేకాదు మోడీ పథకాలు తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని తాను బీజేపీలో చేరినట్టు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్ గా ఉన్న దామోదర రాజనర్సింహపై ఈ ప్రభావం పడుతోంది కదా అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. వ్యక్తిగత విషయాలకు తాను సమాధానం చెప్పబోనని ఆమె బదులిచ్చారు.  పార్టీ అధిష్టానం అవకాశమిస్తే  తాను సంగారెడ్డి నుండి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.  అంతేకాదు పార్టీ తరపున  ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఝలక్: జగ్గారెడ్డిపై బీజేపీ అభ్యర్థిగా దామోదర భార్య?

కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?