తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానంనుండి పోటీ చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించారు.
కామారెడ్డి: తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండే పోటీ చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించారు.
సోమవారంనాడు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో షబ్బీర్ అలీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కామారెడ్డి నుండి పోటీ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి తాను పోటీ చేస్తానని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
undefined
కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు షబ్బీర్ అలీ కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు. మరోసారి కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి షబ్బీర్ అలీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి ఈ దఫా బీఆర్ఎస్ అభ్యర్ధిగా కేసీఆర్ బరిలోకి దిగనున్నారు. గంప గోవర్థన్ ఈ దఫా పోటీకి దూరంగా ఉంటున్నారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి మరోసారి షబ్బీర్ అలీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి అసెంబ్లీ పేరు లేదు. ఈ నెల 25న కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి అసెంబ్లీ స్థానానికి చోటు దక్కలేదు. దీంతో కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ కాకుండా రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు.